ETV Bharat / bharat

కశ్మీర్​లో మోస్ట్​ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం

Jammu Kashmir encounter: కశ్మీర్​లో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో మోస్ట్ ​వాంటెడ్​ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా దళాలు. అతడ్ని.. పోలీసులు, పౌరులపై పలు దాడులు చేసిన హిజ్బుల్​ ముజాహిద్దీన్​ ఉగ్రవాది ఫిరోజ్​ అహ్మద్​గా గుర్తించారు.

author img

By

Published : Dec 15, 2021, 5:02 PM IST

jammu kashmir encounter
కశ్మీర్​ ఎన్​కౌంటర్

Jammu Kashmir encounter: జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో హిజ్బుల్​ ముజాహిద్దీన్​కు చెందిన మోస్ట్​ వాంటెడ్​ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. 2018లో షోపియన్​లోని జైనపోరాలో జరిగిన దాడి సహా పలు ఉగ్రదాడుల్లో పాల్గొని నలుగురు పోలీసు సిబ్బంది మృతికి కారణమైనట్లుగా జమ్ముకశ్మీర్​ పోలీస్​ ప్రతినిధి తెలిపారు.

పుల్వామాలోని ఉజ్రాంపత్రి గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు అందిన పక్కా సమాచారంతో భద్రతా బలగాలు మంగళవారం రాత్రి నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు ఆ అధికారి.

" తనిఖీల్లో భాగంగా ఉగ్రవాది ఉన్న ప్రాంతాన్ని గుర్తించి.. లొంగిపోయేందుకు బలగాలు పలుమార్లు అవకాశం కల్పించాయి. అయినప్పటికీ, బలగాలపై కాల్పులకు పాల్పడ్డాడు. ఆ దాడిని తిప్పికొట్టేందుకు జవాన్లు కాల్పులు జరపటం వల్ల ఎన్​కౌంటర్​గా మారింది. ఈ ఎదురుకాల్పుల్లో హిజ్బుల్​ ముజాహిద్దీన్​కు చెందిన ఏ+ కేటగిరి ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. మృతుడ్ని షోపియన్​లోని హెఫ్​ శ్రీమల్​ ప్రాంతానికి చెందిన ఫిరోజ్​ అహ్మద్​ దార్​గా గుర్తించారు."

- జమ్ముకశ్మీర్​ పోలీస్​

ఫిరోజ్​ 2017 నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు అధికారి. 2019, ఫిబ్రవరిలో ఇశ్రాత్​ మునీర్​ అనే బాలిక హత్యలోనూ అతడి పాత్ర ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే రైఫిల్​, మూడు మ్యాగజైన్లు సహా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 15 ఏళ్ల తర్వాత భారత్​కు చిక్కిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్​స్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.