ETV Bharat / bharat

'జాక్వెలిన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?.. ఆమె విషయంలో ఇలా ఎందుకు?' - జాక్వెలిన్‌ మనీలాండరింగ్ లేటెస్ట్ న్యూస్

మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్​ను ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. దేశం దాటి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారని ఈడీ పేర్కొన్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

Jacqueline Fernandez
జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌
author img

By

Published : Nov 10, 2022, 5:26 PM IST

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సులభంగా దేశం దాటగలరని కోర్టుకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) వెల్లడించింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై దిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టులో విచారణ జరిగింది. ఆమెకు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ దర్యాప్తు సంస్థ వాదనలు వినిపించింది. అయితే ఆమెను ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.

"ఎల్‌ఓసీ జారీ చేసినప్పటికీ.. జాక్వెలిన్‌ను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదు? ఇతర నిందితులు జైల్లో ఉన్నారు. కానీ, ఆమె విషయంలో మీరు ప్రత్యామ్నాయం ఎందుకు ఎంచుకున్నారు?" అని ఈడీని కోర్టు ప్రశ్నించింది. ఆమె రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై రేపు తీర్పు ఇవ్వనుంది. ఇంతకుముందు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

జాక్వెలిన్‌ దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించారని, ఆమె విచారణకు సహకరించడం లేదని ఈడీ వాదిస్తోంది. ఈ కారణాలతో ఆమె బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తోంది. "మా జీవితం మొత్తం మీద మేం రూ.50 లక్షలు కూడా చూడలేదు. జాక్వెలిన్‌ మాత్రం విలాసాలకు రూ.7 కోట్లు ఖర్చుచేసింది. దేశం దాటేందుకు ప్రయత్నించింది. విదేశాలకు వెళ్లేందుకు ఆమె వద్ద తగినంత డబ్బు ఉంది" అంటూ కోర్టుకు వెల్లడించింది. ఆమె దేశం విడిచివెళ్లకుండా ఆపేందుకు ఈడీ ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది.

ఇవీ చదవండి:క్రెడిట్‌ కార్డ్ క్యాన్సిల్‌ చేయాలా? ఈ తప్పులు చేయొద్దు!

ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోలేదని పోలీస్ స్టేషన్​లోనే కత్తితో మెడపై..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.