IPPB Job Recruitment 2023 : ప్రభుత్వ బ్యాంకులో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని కలలు కనే పట్టభద్రులకు శుభవార్త. ఐపీపీబీ-ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులోని మొత్తం 132 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
ఇన్ని పోస్టులు..
IPPB Job Vacancy 2023 : 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు.
విద్యార్హతలు..
IPPB Job Eligibility : గుర్తింపు పొందిన కళాశాల లేదా యునివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పట్టా పొందిన అభ్యర్థులు అర్హులు.
ఏజ్ లిమిట్..
IPPB Job Age Limit : 2023 జూన్ 1 నాటికి 21 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.
వేతనం..
IPPB Job Salary : నెలకు రూ.30,000.
పరీక్ష తేదీ..
IPPB Recruitment 2023 Exam Date : www.ippbonline.com వెబ్సైట్లో త్వరలోనే పరీక్ష తేదీని ప్రకటిస్తారు.
దరఖాస్తు రుముము..
- IPPB Job Application Fees : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- రూ.100/-
- ఓసీ, బీసీ ఇతర కేటగిరీలకు- రూ.300/-
ఎంపిక విధానం..
- IPPB Job Selection Process : రాతపరీక్ష (ఆన్లైన్)
- గ్రూప్ డిస్కష్షన్
- పర్సనల్ ఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్..
సర్కిల్ | ఖాళీలు |
అసోం | 26 |
ఛత్తీస్‌గఢ్ | 27 |
హిమాచల్ ప్రదేశ్ | 12 |
జమ్మూకశ్మీర్/లద్ధాఖ్ | 7/1 |
అరుణాచల్ ప్రదేశ్ | 10 |
మణిపుర్ | 9 |
మేఘాలయ | 8 |
మిజోరం | 6 |
నాగాలాండ్ | 9 |
త్రిపుర | 5 |
ఉత్తరాఖండ్ | 12 |
దరఖాస్తు చివరితేదీ..
IPPB Jobs Last Date : 2023 ఆగస్టు 16. అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవడానికి చివరితేదీ ఆగస్టు 31.
వీరికి ప్రాధాన్యత..
IPPB Recruitment 2023 : బ్యాంకింగ్ రంగంలోని ఫైనాన్షియల్ ప్రాడక్ట్స్‌కు సంబంధించి సేల్స్ లేదా ఆపరేషన్స్ విభాగంలో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంపిక సమయంలో ప్రాధాన్యత ఉంటుంది.
ఇన్ని ప్రశ్నలు.. ఇంత సమయం..
IPPB Recruitment 2023 Notification : మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులను కేటాయించారు. 120 నిమిషాల పరీక్షా సమయం. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. ప్రతి ఒక్త తప్పు సమాధానానికి 0.25 మార్కును తీసేస్తారు.
అప్లికేషన్ మోడ్..
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అఫిషియల్ వెబ్సైట్..
IPPB Official Website : సిలబస్ సహా మరిన్ని వివరాల కోసం బ్యాంకు అధికారిక వెబ్సైట్ www.ippbonline.com ను వీక్షించవచ్చు.
- ఇవీ చదవండి :
- Indian Airforce Recruitment 2023 : అగ్ని వీరులకు వాయుసేన ఆహ్వానం.. 3500కు పైగా పోస్టుల భర్తీ!
- SSC Jobs 2023 : కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇంజినీర్ పోస్టులు.. లక్షకుపైగా జీతం..
- UPSC Jobs 2023 : గవర్న్మెంట్ జాబ్ నోటిఫికేషన్.. లక్షల్లో జీతం.. అప్లై చేసుకోండిలా!
- Health Assistant Posts Notification : 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్