ETV Bharat / bharat

ఎగ్జామ్​ హాల్​లో 500 మంది అమ్మాయిలు.. స్పృహ తప్పిపడిపోయిన 'ఇంటర్​' యువకుడు.. - బిహార్ ఇంటర్ ఎగ్జామ్స్

పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ యువకుడు అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పిపడిపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో? అతడెందుకు అలా పడిపోయాడో ఓ సారి తెలుసుకుందాం.

studen faints in exam hall
studen faints in exam hall
author img

By

Published : Feb 1, 2023, 8:55 PM IST

Updated : Feb 1, 2023, 9:05 PM IST

బిహార్​లోని​ నలందాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. 500 విద్యార్థినుల మధ్య పరీక్ష రాసేందుకు కూర్చోబెట్టడం వల్ల ఓ ఇంటర్​ విద్యార్థి పరీక్ష హాల్​లోనే స్పృహతప్పి పడిపోయాడు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. బ్రిలియంట్ కాన్వెంట్ ప్రైవేట్ స్కూల్​లో వెలుగుచూసింది ఈ విచిత్ర ఘటన.

ఇదీ జరిగింది..
మనీశ్ శంకర్​(17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజ్​లో ఇంటర్ చదువుతున్నాడు. మనీశ్​ను పరీక్ష రాసేందుకు అతడి తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్​ సుందరగడ్​లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్​కు తీసుకొచ్చాడు. బుధవారం షెడ్యూల్ ప్రకారం మ్యాథ్​మెటిక్స్ పరీక్ష జరగనుంది. పరీక్ష రాసేందుకు మనీశ్ హాల్​లోకి వెళ్లాడు. పరీక్ష హాల్​లో ఉన్న బాలికలను చూసి ఒక్కసారి స్పృహతప్పిపడిపోయాడు మనీశ్​ శంకర్​.

"ఒకేసారిగా 500 మంది అమ్మాయిలను చూసి నా మేనల్లుడు చాలా కంగారుపడ్డాడు. అందుకే స్పృహతప్పిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యంగానే ఉన్నాడు.

--మనీశ్ శంకర్ మేనత్త

బిహార్​లో ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం రాష్ట్రంలో 1,464 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 13,18,227 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరిలో బాలికలు 6,36,432 కాగా.. 6,81,795 మంది విద్యార్థులు ఉన్నారు.

Last Updated : Feb 1, 2023, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.