ETV Bharat / bharat

'సంప్రదాయ ఔషధాలపై ఆయుష్ ముద్ర.. వారికి ప్రత్యేక వీసా' - modi latest speech

Ayush mark: భారత్​లో తయారయ్యే సంప్రదాయ ఔషధాలపై ఇకపై ఆయుష్ గుర్తు ఉంటుందని చెప్పారు ప్రధాని మోదీ. సంప్రదాయ చికిత్స కోసం భారత్​కు వచ్చే వారికి ఆయుష్ వీసాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

india-to-introduce-ayush-mark
'సంప్రదాయ ఔషధాలపై ఆయుష్ చిహ్నం.. వారికి ఆయుష్ వీసా'
author img

By

Published : Apr 20, 2022, 1:38 PM IST

PM Modi news: భారత్​లో త్వరలో ఆయుష్​ గుర్తును ప్రారంభించనున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలోని సంప్రదాయ ఔషధ ఉత్పత్తుల ప్రామాణికతను దీని ద్వారా గుర్తించవచ్చన్నారు. అంతేగాక సంప్రదాయ చికిత్సల కోసం భారత్​కు వచ్చే విదేశీయులకు ఆయుష్ వీసా పేరుతో ప్రత్యేక కేటగిరీ వీసాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు.

గుజరాత్​ మహాత్మా మందిర్​లో మూడు రోజుల పాటు జరిగే 'గ్లోబల్ ఆయుష్​ ఇన్వెస్ట్​మెంట్​ అండ్​ ఇన్నోవేషన్​' కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు మోదీ. అనంతరం మాట్లాడారు. 'భారత్​లో త్వరలో ఆయుష్ గుర్తును పరిచయం చేస్తాం. ఇది దేశంలోని నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులకు ప్రామాణికతను ఇస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశీలించిన ఉత్పత్తులకు ఈ మార్క్ ఇస్తాం. ఇది నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామనే విశ్వాసాన్ని ప్రపంచ దేశాల ప్రజలకు కల్పిస్తుంది' అని మోదీ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్​, మారిషస్ ప్రధాని ప్రవింద్​ జుగ్నౌత్​ పాల్గొన్నారు. టెడ్రోస్ మాట్లాడుతూ.. 'దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడులతో పాటు ప్రభుత్వ మద్దతు సంప్రదాయ ఔషధ రంగంలో ఆవిష్కరణలకు కీలకం. ఆవిష్కర్తలు, పరిశ్రమ, ప్రభుత్వం సుస్థిరంగా, పర్యావరణపరంగా సున్నితంగా సంప్రదాయ ఔషధాలను అభివృద్ధి చేయాలి' అని అన్నారు.

ఇదీ చదవండి: దేశ సైనికుల కోసం రోబో.. బాలమేధావి ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.