భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona virus India) వరుసగా రెండో రోజూ 40వేలకుపైగా నమోదైంది. కొత్తగా 44,658 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో మంది 496 మరణించారు. ఒక్కరోజే 32,988 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు: 3,26,03,188
- మొత్తం మరణాలు: 4,36,861
- మొత్తం కోలుకున్నవారు: 3,18,21,428
- యాక్టివ్ కేసులు: 3,44,899
వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా గురువారం మరో 79,48,439 కొవిడ్ టీకా(Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 61,22,08,542 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొవిడ్ పరీక్షలు
దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 18,24,931 కొవిడ్ పరీక్షలు(Covid tests) చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 51,49,54,309కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలకుపైగా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. అన్ని దేశాల్లో కలిపి మరో 7 లక్షల 13వేల మంది వైరస్ బారినపడ్డారు. మరో 10,700 మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. అగ్రరాజ్య అమెరికాలో అత్యధికంగా 1,69,953 కేసులు నమోదయ్యాయి. అక్కడ మరో 1,215 మంది మృత్యువాత పడ్డారు. బ్రెజిల్, బ్రిటన్ ఈరాన్లో 30వేలకు పైగా కొవిడ్ కేసులు వెలుగు చూశాయి.
ఇదీ చూడండి: భారత్‌లో కొవిడ్ అధ్యయనానికి గిన్నిస్ రికార్డ్!