అంతర్జాతీయంగా మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రస్తుత సన్నద్ధతపై మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో సన్నద్ధతను పర్యవేక్షించారు. అలాగే రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు తమ దగ్గర ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, ఐసోలేషన్ పడకల సామర్థ్యం, ఐసీయూ, వెంటిలేటర్ పడకల లభ్యతను సమీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిపై దృష్టి సారించారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుత కలవరం వేళ సోమవారం మాండవీయ ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులు, నిపుణులతో సమావేశం అయ్యారు. ఈ సమయంలో కొవిడ్ నియమావళని పాటించడం ఎంత ముఖ్యమో.. తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడమూ అంతే ముఖ్యమని సూచించారు. అందరూ ధ్రువీకరించిన సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలని కోరారు. రెండో బూస్టర్ డోసు పరిగణనలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వైద్య సిబ్బందికి వీటిని అందించేలా చూడాలన్నారు.
![india holds corona mock drill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17321152_mandaveya.jpg)
![india holds corona mock drill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17321152_mack2.jpg)
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. కొవిడ్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనే సన్నాహాల్లో భాగంగా దిల్లీ ప్రభుత్వం ఔషధాల కోసం ముందస్తుగా రూ.104 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. కర్ణాటక ప్రభుత్వం మాస్క్‌ను తప్పనిసరి చేసింది. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరింది.
![india holds corona mock drill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17321152_mack.jpg)
![india holds corona mock drill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17321152_mack3.jpg)
![india holds corona mock drill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17321152_munsuk.jpg)