ETV Bharat / bharat

Viral Fever: వణికిస్తున్న జ్వరాలు.. వారంలో 40 మందికిపైగా మృతి!

అసలే కరోనా.. ఆపై విష జ్వరాల విజృంభణ. ఇదీ ఉత్తర్​ప్రదేశ్​లోని ​(UP Fever News) ఫిరోజాబాద్‌ జిల్లా పరిస్థితి. గడచిన వారం రోజుల్లోనే ఈ జిల్లాలో విష జ్వరాలకు 41 మంది బలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరణించిన వారిలో 32మంది పిల్లలు సైతం ఉండటం కలచివేస్తోంది.

fever
fever
author img

By

Published : Sep 2, 2021, 7:30 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్ జిల్లాలో తీవ్ర జ్వరంతో(Viral Fever in Uttar Pradesh) 32 మంది పిల్లలు సహా 41మంది మరణించడం కలకలం రేపుతోంది. దీనికి డెంగీనే(Dengue Fever) కారణం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిరోజాబాద్ జిల్లా(Firozabad district) ప్రధాన వైద్యాధికారి నీతా కుల్​శ్రేష్ఠ్​ను బదిలీ చేయడం చర్చనీయాశం అయింది. ఆమెను అలీగఢ్ మల్​ఖాన్​ సింగ్ జిల్లా ఆసుపత్రికి సీనియర్ కన్సల్టెంట్​గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బదిలీ ఎందుకు చేశారన్న అంశపై స్పష్టత లేదు.

మరోవైపు ఫిరోజాబాద్​లో ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు దిల్లీ ఐసీఎంఆర్ నుంచి 11 మంది నిపుణుల బృందం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.