ETV Bharat / bharat

కరోనా చికిత్సలో ఆ మందులు వాడొద్దు: ఐసీఎంఆర్​ - ప్రపంచ ఆరోగ్య సంస్ధ

కరోనా వైరస్​ చికిత్సలో విస్తృతంగా ఉపయోగించే ఔషధాల జాబితా నుంచి(Coronavirus Treatment Medicine) ఐవర్​మెక్టిన్(Ivermectin Tablet), హైడ్రాక్సీక్లోరోక్విన్​ను(Hydroxychloroquine ) ఐసీఎంఆర్ తొలగించింది. వీటి పనితీరుపై నిపుణుల బృందం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొవిడ్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరే అవసరం ఉన్న రోగులకు యాంటీబాడీ చికిత్స అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది.

ICMR removes Ivermectin
ICMR removes Ivermectin
author img

By

Published : Sep 24, 2021, 4:11 PM IST

కొవిడ్ రోగుల చికిత్సలో వాడే ఔషధాల జాబితా నుంచి ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్​ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR Guidelines for Covid 19 Treatment) తొలగించింది. కరోనా వైరస్​ చికిత్సలో విస్తృతంగా ఉపయోగించే ఈ ఔషధాల (Covid 19 Treatment Drugs) పనితీరు ప్రభావవంతంగా లేదన్న అధ్యయనాల మేరకు ఈ నిర్ణయం తీసుకుని.. కొత్త మార్గదర్శకాలు జారీచేసింది.

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) అధ్యయనం ప్రకారం.. కరోనా నుంచి కోలుకునే సమయాన్ని ఐవర్‌మెక్టిన్(Ivermectin Tablets Uses)​ తగ్గించలేదని తేలింది. దీనితోపాటు.. కరోనా సోకిన రోగులు వెంటనే మరణించే అవకాశం లేనందున హైడ్రాక్సీక్లోరోక్విన్(Hydroxychloroquine Tablets Uses)​ ఉపయోగించొద్దని ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది.

వారికి యాంటీబాడి చికిత్స..

మరోవైపు... కొవిడ్‌ సోకి ఆసుపత్రుల్లో చేర్పించాల్సిన అవసరం చాలా ఉన్న రోగులకు యాంటీబాడీ చికిత్స(Antibody Treatment for Covid) అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు(World Health Organization Covid) చేసింది. ఇలాంటి వారు సహా.. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న కొవిడ్‌ రోగులకు క్యాసిరివిమాబ్‌, ఇమ్‌డివిమాబ్‌ ఔషధాలతో కూడిన సంయుక్త యాంటీబాడీ చికిత్స అందించాలని డబ్ల్యూహెచ్​ఓ మార్గదర్శకాల అభివృద్ధి బృందం సిఫార్సు చేసింది. వైద్య పరిశోధనా జర్నల్‌ ది బీఎంజే ఈ మార్గదర్శకాలను ప్రచురించింది.

యాండీబాడీ చికిత్సలకు సంబంధించి రెండు ప్రయోగాలను చేసినట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. కొవిడ్‌ తీవ్రత ఎక్కువ లేకున్నా ఆసుపత్రుల్లో చేర్పించాల్సిన అవసరం ఉన్న రోగులు, కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి సొంత యాంటీబాడీలకు శరీరం స్పందించని రోగులపై వేర్వేరుగా డబ్ల్యూహెచ్​ఓ ప్రయోగాలు నిర్వహించింది.

మొదటి తరహా రోగుల్లో క్యాసిరివిమాబ్‌, ఇమ్‌డివిమాబ్‌(Casirivimab and Imdevimab Uses) ఔషధాలతో కూడిన సంయుక్త యాంటీబాడీ చికిత్స(Antibody Cocktail Treatment) ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని డబ్ల్యూహెచ్​ఓ తన మార్గదర్శకాల్లో తెలిపింది. యాంటీబాడీలకు స్పందించని రెండో తరహా రోగుల్లో క్యాసిరివిమాబ్‌, ఇమ్‌డివిమాబ్‌ ఔషధాలు మరణాలను తగ్గించడం సహా వెంటిలేషన్‌ అవసరం లేకుండా చేస్తాయని వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.