ETV Bharat / bharat

IAS పెంపుడు శునకం మిస్సింగ్.. ఆచూకీ కోసం పోస్టర్లు.. వెతికిస్తే రివార్డ్!

తప్పిపోయిన ఐఏఎస్​ ఆఫీసర్ పెంపుడు కోసం మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో పోస్టర్లు వెలిశాయి. కుక్కను పట్టిస్తే తగిన పారితోషికం ఇస్తామని కూడా అందులో ఉంది. కుక్క కోసం పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తున్నారు.

ias-pet-dog-missing-in-gwalior-dog-missing-posters-in-madhya-pradesh
తప్పిపోయిన ఐఏఎస్​ ఆఫీసర్​ పెంపుడు కుక్క
author img

By

Published : Apr 3, 2023, 8:25 PM IST

సాధారణంగా మనుషులు తప్పిపోయారని పోస్టర్లు చూస్తూ ఉంటాం. కానీ మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో మాత్రం.. పెంపుడు కుక్క కనిపించటం లేదనే పోస్టర్లు వెలిశాయి. తప్పిపోయిన ఆ కుక్కను పట్టిస్తే తగిన పారితోషికం కూడా ఇస్తామని అందులో ఉంది. పోలీసులు సైతం కుక్క కోసం తెగ వెతుకుతున్నారు. రాత్రీ పగలూ దానికోసం గాలిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇంత హడావుడి చేయడానికి కారణం.. ఆ కుక్క ఓ ఐఏఎస్​ ఆఫీసర్​ది​ కావడమే.

తప్పిపోయిన పెంపుడు శునకం.. రాహుల్ ద్వివేది అనే ఐఏఎస్​ ఆఫీసర్​కు చెందినది. ఆయనకు రెండు శునకాలు ఉన్నాయి. వాటిని రాహుల్ సిబ్బంది భోపాల్​ నుంచి దిల్లీ తీసుకెళుతున్నారు. మార్గమధ్యలో గ్వాలియర్​.. బిలువా ప్రాంతలో ఉన్న ఓ దాబా వద్ద ఆగారు. దాబా లోపలికి వెళ్లి.. తినేసి తిరిగి వచ్చేసరికి.. శునకాలు కనిపించలేదు. అవి తప్పించుకున్నాయని నిర్ధరించుకున్న సిబ్బంది.. వాటిని కోసం తీవ్రంగా గాలించారు. కాసేపు వెతికిన తరువాత వారికి రెండిట్లో ఒకటి చిక్కింది. మరొక దాని ఆచూకీ మాత్రం దొరకడం లేదు. దీంతో కుక్క తప్పిపోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు సిబ్బంది.

ias pet dog missing in gwalior dog missing posters in madhya pradesh
తప్పిపోయిన ఐఏఎస్​ ఆఫీసర్​ పెంపుడు కుక్క

ప్రస్తుతం రాహుల్​ ద్వివేది దిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడు అనయ్​ ద్వివేది గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్​గా పనిచేస్తున్నారు. రాహుల్​కు ఆ శునకాలంటే చాలా ఇష్టమని అనయ్​ తెలిపారు. "ఘటనపై ద్వివేది సిబ్బంది మాకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా తప్పిపోయిన శునకాన్ని మూడు రోజుల నుంచి వెతుకుతున్నాం. దాబా పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు కూడా వేశాం. తీవ్రంగా గాలించాం. చుట్టుపక్క మిగతా హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్​ యజమానులకు దీనిపై సమాచారం ఇచ్చాం. కనిపిస్తే కాల్​ చేయమని వారికి చెప్పాం" గ్వాలియర్ పోలీసులు తెలిపారు.

తప్పిపోయిన చిలక కోసం కేసు పెట్టిన వ్యక్తి..
గతంలో ఛత్తీస్​గఢ్ బస్తర్​ జిల్లా జగదల్​పుర్​లో ఇలాంటి ఘటనే జరిగింది. మనీశ్ ఠక్కర్​ అనే వ్యక్తి తను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ రామచిలక వెన్నుపోటు పొడిచి పారిపోయిందని పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కేసు నమోదు చేశాడు. చిలకకు ప్రతిరోజు ఆహారం అందించి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నానని, కానీ అది మాత్రం తనను మోసం చేసి ఎగిరిపోయిందని వాపోయాడు.

ప్రతిరోజు చిలకను పంజరంలోనే ఉంచే వాడినని మనీశ్ చెప్పాడు. ఏడు సంవత్సరాలుగా దాన్ని కుటుంబ సభ్యురాలిగా చుసుకుంటున్నామని వివరించాడు. ఉదయం, సాయంత్రం ఆహారం అందిస్తున్నట్లు పేర్కొన్నాడు. కానీ పంజరం తెరవగానే అది ఎగిరిపోయిందని, మళ్లీ వెనక్కి తిరిగి రాలేదని తెలిపాడు. దాన్ని ఎలాగైనా వెతికిపెట్టాలని పోలీసులను కోరాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.