భారత వైమానిక దళం వినూత్న ఆవిష్కరణను చేపట్టింది. ప్రతికూల పరిస్థితుల్లో విమాన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. IAF తీసుకురానున్న నూతన టెక్నాలజీని 'వాయులింక్' అని పిలుస్తారని ఓ అధికారి తెలిపారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-IRNSS ఆధారంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. IRNSSను నావిక్‌గా కూడా పిలుస్తారని వివరించారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందిన వాయులింక్‌తో ఇతర విమానాలు ఢీకొనకుండా జాగ్రత్త పడొచ్చు. అంతేకాకుండా భూమిపైనున్న యుద్ధ ట్యాంకులు, ఇతర వాహనాల కదలికలను కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. వీటితో పాటు సిగ్నల్స్ జామ్ కాకుండా కూడా వాయులింక్ తోడ్పడుతుంది.
శత్రు సేనలపై మూక దాడులకు వెళ్లేందుకు వాయులింక్ పరిజ్ఞానం తోడ్పడనుంది. రేడియో సిగ్నల్స్ అందుబాటులో ఉండని కొండ ప్రాంతాల్లో పైలట్లకు ఈ సాంకేతికత కీలకం కానుంది. ఆ సమయంలో బేస్ స్టేషన్‌తో అనుసంధానానికి ఇది తోడ్పడనుంది. IAF రూపొందించిన వాయులింక్ టెక్నాలజీని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో కూడా వినియోగించుకోవచ్చని వింగ్ కమాండర్ మిశ్రా తెలిపారు. ఏరో ఇండియా ప్రదర్శనలో వాయులింక్‌కు సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి : మహిళలకు నెలనెలా ఫ్రీగా రూ.500.. రైతులకు వడ్డీ లేని లోన్స్.. సీఎం గిఫ్ట్!
1,000 అడుగుల కొండపై పదో శతాబ్దం నాటి గుడి.. ఏడాదికోసారి శివరాత్రికి మాత్రమే ఓపెన్