ETV Bharat / bharat

ప్రియుడి కోసం భర్త హత్యకు భార్య సుపారీ.. వారి​ పేరు చెప్పి డ్రామా.. చివరకు.. - వివాహేతర సంబంధంతో భర్తను హత్య చేయించిన భార్య

Husband murdered by wife: వివాహేతర సంబంధం కారణంగా సొంత భర్తనే కడతేర్చింది ఓ మహిళ. అంతటితో ఆగకుండా దుండగులు తన భర్తను హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పంజాబ్​లో జరిగింది.

Husband murdered by wife
భర్త హత్య
author img

By

Published : Jun 13, 2022, 1:30 PM IST

Husband murdered by wife: తన భర్తను దుండగులు బైక్​పై వచ్చి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అయితే ఆమె, తన ప్రియుడు మరో వ్యక్తికి సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకు విహహేతర సంబంధమే కారణమని నిర్ధరణ అయింది. ఈ ఘటన పంజాబ్​లోని అమృత్​సర్​ సమీపంలోని కాలే గ్రామంలో ఆదివారం జరిగింది.

Husband murdered by wife
నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అసలేం జరిగిందంటే: హరీందర్ సింగ్ దుబాయ్​లో ఉండేవాడు. అతని భార్య సత్నామ్​ కౌర్.. పంజాబ్​లో ఉండేది. అర్ష్​దీప్ అనే వ్యక్తితో.. సత్నామ్​ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆ విషయం హరీందర్​కు తెలియడం వల్ల భార్యను మందలించాడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హరీందర్​ను హత్య చేయాలని అర్ష్​దీప్​, సత్నామ్ నిర్ణయించుకున్నారు. హరీందర్​ను హత్య చేసేందుకు వరీందర్​తో రూ.2,70,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు.

పోలీసులకు ఫిర్యాదు: "సచ్​ఖండ్ శ్రీ హర్​మందిర్​ సాహిబ్​కు నేను నా భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లేటప్పుడు దుండగులు బైక్​పై వచ్చి దాడి చేశారు. నా భర్త పర్సు, మొబైల్​ను లాక్కున్నారు. నా భర్త ప్రతిఘటించగా వారు అతనిపై గన్​తో కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తరలిస్తుండగా నా భర్త ప్రాణాలు కోల్పోయాడు" అని పోలీసులకు నిందితురాలు సత్నామ్​ కౌర్​ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ విచారించారు. 12 గంటల్లోనే కేసును ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి: ప్రార్థనలు చేసి వస్తుండగా లోయలో పడిన కారు.. నలుగురు దుర్మరణం

ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్.. నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.