ETV Bharat / bharat

ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండు కొట్టించిన భర్త - ఉత్తర్​ప్రదేశ్​లో భార్యకు గుండుకొట్టించిన భర్త

ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని ఓ వ్యక్తి తన భార్యకు గుండు కొట్టించాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. దీంతో ఆ వివాహిత తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

husband-made-wife-bald-after-getting-hair-in-food-in-uttarpradesh
భార్యకు గుండుకొట్టించిన భర్త
author img

By

Published : Dec 11, 2022, 9:15 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. తినే ఆహారంలో తల వెంట్రుకలు వచ్చాయని కోపోద్రిక్తుడైన భర్త తన భార్యకు గుండు కొట్టించాడు. దీంతో ఆ వివాహిత తన భర్తతో సహా ముగ్గురిపై వరకట్న చట్టంలో పలు సెక్షన్ల కింద కేసు పెట్టింది.
అసలేం జరిగిందంటే..:
పోలీసులకు వివాహిత అందించిన సమాచారం ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​ పీలీభీత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్​కు, సీమాదేవి(30)కి 7 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. పెళ్లయినప్పటి నుంచి రూ.15 లక్షలు కట్నం ఇవ్వాలని అత్తింటివారు తనను వేధిస్తున్నారని సీమాదేవి తెలిపింది. కాగా, శుక్రవారం రాత్రి ఇంట్లో మహిళ వంట చేసింది. తర్వాత ఆమె తన భర్తకు ఒక ప్లేట్​లో ఆహారం వడ్డించింది.

అయితే ఆమె భర్తకు ఆ ప్లేట్​​లో తల వెంట్రుక కనిపించింది. దీంతో కోపం తెచ్చుకున్న అతడు.. తన భార్యకు గుండు కొట్టించాడు. ఘటన అనంతరం వివాహిత ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహిత నుంచి అందిన కంప్లైంట్ ఆధారంగా.. నిందితులపై వరకట్న చట్టంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ భర్తను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పోలీసు అధికారి సతీష్ శుక్లా చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.