ETV Bharat / bharat

పసి బిడ్డను చంపి, మహిళ ఆత్మహత్య.. భర్త మరణవార్త విన్న నిమిషాల్లోనే.. - మంగళూరు రోడ్డు ప్రమాదం

Husband dies accident Mangaluru: భర్త మరణవార్త విని తట్టుకోలేక ఓ భార్య తన ఆరు నెలల కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి కర్ణాటకలోని రాయ్​చూర్​లో జరిగింది.

Husband dies accident Mangaluru
భర్త మరణించాడని తాను ఆత్మహత్య
author img

By

Published : Apr 17, 2022, 3:42 PM IST

Husband dies accident Mangaluru: భర్త చనిపోయాడన్న బాధతో తన ఆరు నెలల కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటన కర్ణాటక రాయ్​చూర్​​లో శనివారం రాత్రి 10 గంటలకు జరిగింది. గంగాధర్​ బి కమ్మర(36), శ్రుతి(30) భార్యాభర్తలు. వీరికి ఆరు నెలల కుమారుడు అభిరామ్​ ఉన్నాడు. మంగళూరులోని అగ్నిమాపక దళంలో గంగాధర్ డ్రైవర్​గా ఉద్యోగం చేస్తున్నాడు. రాయ్​చూర్​​లో ఈయన కుటుంబం నివాసం ఉంటోంది.

శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధర్ మరణించాడు. కుంటికాన సమీపంలో గంగాధర్​ రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి కుందాపుర్ వెళ్తున్న కారు ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం రాయచూర్‌లో ఉన్న అతని భార్యకు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్​కు గురైంది. భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో తన ఆరు నెలల చిన్నారి అభిరామ్​ను హత్యచేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. మంగళూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు గంగాధర్ ఇంటికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: భార్యపై కోపం.. మరో ఇద్దరిని పిలిపించి గ్యాంగ్​ రేప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.