కరోనా సంక్షోభ సమయంలో ప్రాణవాయువు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రకృతితో మానవాళి సంబంధాల్ని మునుపటిలా పునరుద్ధరించుకోవడం అనివార్యమైంది. ఒక చెట్టు పెరిగిన తర్వాత ఏడాదికి రూ. కోట్లు విలువ చేసే ఆక్సిజన్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా ఉత్పత్తి చేస్తుంది. కరోనా రెండో దశ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ప్రాణవాయువు కొనుగోలు చేయడం ఆర్థికంగా ముడిపడి ఉన్న అంశమని తేటతెల్లమైంది. చెట్లు నాటడం ఎంత ముఖ్యమో తెలిసేలా చేసింది. అయితే అభివృద్ధి పేరుతో మానవాళి చర్యల కారణంగా ప్రతి ఏడాది అటవీ ప్రాంతం తగ్గుతూ వస్తోంది. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం(World Environment Day) సందర్భంగా ఆక్సిజన్ విలువ ఏంటో తెలుసుకుందాం.
![World Environment Day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12023014_img1.jpg)
![World Environment Day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12023014_img2.jpg)
![World Environment Day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12023014_img3.jpg)
![World Environment Day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12023014_img4.jpg)