ETV Bharat / bharat

How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి! - కుక్కర్​లో మటన్ కర్రీ ఎలా వండాలి

How to Prepare Mutton Curry in Cooker: నాన్ వెజ్​లో ఎన్ని వెరైటీలు ఉన్నా.. అందులో మటన్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. మార్కెట్లో దీని ధర మాత్రమే కాదు.. టేస్ట్​ కూడా "హై"లో ఉంటుంది. అయితే.. వండే విధానమే కర్రీ రుచిని డిసైడ్ చేస్తుంది. మరి.. మటన్ కర్రీని అద్భుతంగా ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

Mutton Curry Recipe
How to Prepare Mutton Curry in Cooker
author img

By

Published : Aug 19, 2023, 7:55 PM IST

Updated : Aug 20, 2023, 10:53 AM IST

How to Prepare Mutton Curry in Cooker: మంసాహార ప్రియులు ఆదివారం వచ్చిదంటే చాలు అదొక పండగ రోజులా భావిస్తుంటారు. మార్కెట్లో మాంసం చికెన్, మటన్ ధరలు ఎలా ఉన్నా.. వీకెండ్​లో టేస్ట్ చేయాల్సిందే. సండే రోజున 'ముక్క లేనిదే ముద్ద దిగదు' అనే సామెతను అనుసరిస్తుంటారు. అయితే.. చాలా మంది మాంసాహారులు అతి ఇష్టంగా తినే వాటిల్లో.. మ‌ట‌న్ (మేక కూర) కర్రీ ముందు వరసలో ఉంటుంది. అయితే.. ఈ మటన్​ పలు ప్రాంతాల్లో.. పలు రకాలుగా వండుతారు. ఇక్కడ మనం కుక్కర్​లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం కావలసిన పదార్థాలు ఏంటి..? కుకింగ్ ప్రాసెస్ ఏంటీ? అనే విషయాలను తెలుసుకుందాం.

మటన్‌ను కుక్కర్‌లో ఉడికించేందుకు కావలసిన పదార్థాలు..

Ingredients for cooking Mutton in cooker:

  • కేజీ మటన్
  • 2 టేబుల్ స్పూన్ల నూనె
  • 1/2 టీ స్పూన్ పసుపు
  • 2 టీ స్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్
  • 2 టీస్పూన్ల గసగసాలు
  • 1/2 టీస్పూన్ జీలకర్ర
  • 2 టీ స్పూన్ల ధనియాలు (వేయించినవి)
  • 3 టీస్పూన్ల కొబ్బరి పొడి
  • గరం-మసాలా
  • 3 యాలకులు
  • 4-5 లవంగాలు
  • 2-3 జోడించిన దాల్చిన చెక్క
  • 1/2 టీస్పూన్ షాజీరా
  • అల్లం, వెల్లుల్లి రెబ్బలు
  • 3 టీస్పూన్ల కారం
  • 2 టీస్పూన్ల ఉప్పు
  • మసాలా పేస్ట్
  • 1 కప్పు నీళ్లు
  • చివరగా కొత్తిమీర తరుగు

మటన్ తయారీ విధానం..

How to Make Mutton Curry : మటన్ కర్రీ విషయంలో చాలా మంది ప్రెషర్ కుక్కర్‌లోనే మటన్‌ను ఉడకబెడుతుంటారు. ఇలా చేయడం ద్వారా వేగంగా ఉడుకుతుంది. మటన్‌ కర్రీ తయారీ ప్రారంభించే ముందు.. మాంసాన్ని శుభ్రంగా కడిగాలి. ఆ తర్వాతే వంటకు సిద్ధమవ్వాలి.

Mutton Curry in Cooker : ముందుగా.. కుక్కర్ ను స్టౌ మీద పెట్టి, 2 టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కలర్​లోకి మారే వరకు వేగనివ్వాలి. అనంతరం 1/2 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను వేసి మిక్స్ చేయాలి. ఒక నిమిషం పాటు వేగనిచ్చి.. అందులో శుభ్రం చేసిపెట్టుకున్న మటన్ ముక్కలు వేసి, నూనెలో కాసేపు ఉడికించాలి. అనంతరం మూతపెట్టి, మటన్‌ ముక్కల్లోని వాటర్ కంటెంట్ పూర్తిగా ఆవిరయ్యేంత వరకు ఉడకనివ్వండి.

ఈ లోపు మసాలా దినుసులు మిక్సీ పట్టుకోండి. మిక్సీ జార్​లోకి 2 టీస్పూన్ల గసగసాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 2 టీస్పూన్లు ధనియాలు (వేయించినవి), 3 టీస్పూన్ల కొబ్బరి పొడి, గరం-మసాలా, 3 యాలకులు, 4-5 లవంగాలు, దాల్చిన చెక్క, 1/2 టీస్పూన్ షాజీరాతోపాటు అల్లం- వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టండి.

ఆ తర్వాత కుక్కరు మూత తీసి.. ఉడికించిన మటన్‌లో 3 టీస్పూన్ల కారం, 2 టీస్పూన్ల ఉప్పు వేసి కలపాలి. కాసేపటి తర్వాత.. మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలిపి, మరి కాసేపు ఉడకనివ్వండి. కాసేపు తర్వాత 1 కప్పు నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టేయండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. కుక్కర్ చల్లారే వరకూ వేచి చూసి.. ఆ తర్వాత మూత ఓపెన్ చేయండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసేయండి.

అంతే.. ఘుమఘుమలాడే మటన్ కర్రీ సిద్ధమైపోతుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం..? వెంటనే మటన్ తెచ్చేయండి. అద్దిరిపోయేలా వండుకొని.. ప్లేట్లు సైతం నాకేయండి. ఈ ఆదివారం రోజున ఇలా పండగ చేసుకోండి.

Last Updated : Aug 20, 2023, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.