Telangana Driving Licence Status in Online : వాహనం ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. మోటార్ వెహికిల్ నిబంధనలు మరింత కఠినంగా మారిన తర్వాత.. లైసెన్స్ తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే నిత్యం వేలాదిగా లైసెన్స్ దరఖాస్తులు ఆర్టీవో కార్యాలనికి పోటెత్తుతుంటాయి. ఈ క్రమంలోనే లైసెన్స్‌లు జారీ కావడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో.. అభ్యర్థులు తమ లైసెన్స్ దరఖాస్తు తిరస్కరించారా..? ఏం జరిగి ఉంటుంది అనే ఆందోళనలో ఉంటారు. మరి కొంత మంది అప్లికేషన్లు పలు కారణాలతో.. నిజంగానే తిరస్కారానికి గురై ఉంటాయి. మరి, మీ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ఏ స్టేజ్‌లో ఉందో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? చాలా సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి.
ఇలా చేయండి..
- లైసెన్స్ దరఖాస్తు స్టేటస్ తెలుసుకునేందుకు.. ముందుగా తెలంగాణ రవాణా శాఖ అఫీషియల్ వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత.. కొద్దిగా కిందకు స్క్రోల్ చేసిన తర్వాత "డాక్యుమెంట్ డెలివరీ స్టేటస్" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఆటోమేటెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్ పేజీ (AOS) ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ.. "మాడ్యూల్‌ని ఎంచుకోండి" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి "లైసెన్స్" ను సెలక్ట్ చేయండి.
- ఆ తర్వాత "ఇన్‌పుట్ టైప్"పై నొక్కి, డ్రాప్-డౌన్ నుండి "అప్లికేషన్ నంబర్" సెలక్ట్ చేసుకోవాలి.
- ఇక్కడ అడిగిన వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత.. "గెట్ డీటెయిల్స్" ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఈ స్టెప్స్ అన్నీ పక్కాగా పూర్తి చేసిన తర్వాత.. మీ లైసెన్స్ నంబర్ నుంచి.. కార్డ్ ప్రింట్ చేసిన తేదీ వరకు మొత్తం సమాచారం కనిపిస్తుంది.
రెండో పద్ధతి...
- మొదటి పద్ధతిలో కుదరకపోతే.. రెండో పద్ధతి కూడా ఉంది. నేషనల్ గవర్నమెంట్ సేవల పోర్టల్ వెబ్‌సైట్ ద్వారా కూడా మీ లైసెన్స్ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.
- దీనికోసం ముందుగా.. "National Government Service" పోర్టల్‌లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఇందులో.. "Application for driving Licence in Telangana" అని సెర్చ్ చేయండి. ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేయండి.
- ఇప్పుడు మీకు.. "Department of Road Transport Authority Fresh Driving Licence" అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు తెలంగాణ రవాణా శాఖ వెబ్‌సైట్‌కి వెళ్తారు.
- ఇక్కడి నుంచి.. మొదటి పద్ధతిలో చెప్పిన విధంగా సెర్చే చేస్తూ వెళ్తే సరిపోతుంది.
ఆఫ్ లైన్లో ఎలా తెలుసుకోవాలి?
How to Check Driving Licence Status in Offline :
- ఆఫ్‌లైన్‌లో లైసెన్స్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలంటే.. మీ సమీపంలోని లేదా మీరు డ్రైవింగ్ పరీక్షకు హాజరైన RTO కార్యాలయాన్ని సందర్శించాలి.
- అక్కడ అధికారిని కలిసి.. మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటివి సమర్పించాలి.
- ఈ సమయంలో మీ లెర్నర్ లైసెన్స్ చూపించమని కూడా అడిగే ఛాన్స్ ఉంది.
- అయితే.. సాధారణంగా డ్రైవింగ్ టెస్ట్ కంప్లీట్ అయిన 2 వారాలలో లైసెన్స్ కార్డు ఇంటికే పంపిస్తారు.
- రెండు వారాలు దాటినా కార్డు రాకపోతే.. అప్పుడు.. కార్యాలయానికి వెళ్లడం గానీ.. ఆన్ లైన్లో స్టేటస్ తెలుసుకోవడం గానీ చేయాలని చెబుతున్నారు అధికారులు.
- ఒక్కోసారి పోస్టల్ సేవల జాప్యం కూడా.. కార్డు పొందడానికి ఆలస్యం కావచ్చు.
- అందువల్ల.. అప్లై చేసిన తర్వాతి రోజు నుంచే.. స్టేటస్ చెక్ చేయడం వంటివి చేయకూడదు.