ETV Bharat / bharat

అసోం-మిజోరం హింసపై కాంగ్రెస్ ఫైర్

అసోం-మిజోరం సరిహద్దు హింసపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజల్లో అపనమ్మకం, విద్వేషాలను నింపుతున్నారని ధ్వజమెత్తింది. లోక్​సభలో దీనిపై చర్చించాలని డిమాండ్ చేసింది. మరోవైపు, టీఎంసీ సైతం ఈ ఘటనపై విమర్శలు గుప్పించింది.

rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Jul 27, 2021, 12:25 PM IST

అసోం-మిజోరం సరిహద్దులో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజల్లో అపనమ్మకం, విద్వేషాలను నింపుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ భయంకర పరిణామాల పర్యవసనాలను దేశం ఇప్పుడు చవిచూస్తోందని అన్నారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్.. హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీంతోపాటు హింసకు సంబంధించినదిగా పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

  • Heartfelt condolences to the families of those who’ve been killed. I hope the injured recover soon.

    HM has failed the country yet again by sowing hatred and distrust into the lives of people. India is now reaping its dreadful consequences. #AssamMizoramBorder pic.twitter.com/HJ3n2LHrG8

    — Rahul Gandhi (@RahulGandhi) July 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కమిటీ ఏర్పాటు

మరోవైపు, ఈ ఘటనపై నిజనిర్ధరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ చాచర్ సహా రెండు రాష్ట్రాల సరిహద్దులో అలజడులు తలెత్తిన ప్రాంతాల్లో పర్యటిస్తారని పార్టీ తెలిపింది. అసోం కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు భూపెన్ బోరా కమిటీకి నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది.

అదే సమయంలో, ఈ అంశంపై చర్చ జరపాలని లోక్​సభలో కాంగ్రెస్ ఉపసభాపక్ష నేత గౌరవ్ గొగొయి డిమాండ్ చేశారు. దీనిపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హింసపై దర్యాప్తు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేకంగా లేఖ రాశారు.

ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజులు: టీఎంసీ

అసోం-మిజోరాం సరిహద్దు ఘటనపై టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. భాజపా హయాంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు.. దేశంలో ప్రజాస్వామ్యానికి చివరి రోజులకు ఆహ్వానం పలుకుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'శౌర్య, పరాక్రమాలకు సీఆర్​పీఎఫ్ బలగాలు నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.