ETV Bharat / bharat

'జ్ఞాన్​వాపి మసీదులో బయటపడిన శివలింగం!'

Gyanvapi mosque survey: జ్ఞాన్​వాపి మసీదు-శృగార్​ గౌరీ ప్రాంగణంలో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే ముగిసింది. ప్రార్థన స్థలంలోని మూడు గోపురాలు, నేలమాళిగలు, చెరువు తదితర ప్రదేశాలను వీడియో తీశారు. ఈ సందర్భంగా మసీదు చెరువులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు.

Gyanvapi mosque survey
జ్ఞాన్​వాపి మసీదు
author img

By

Published : May 16, 2022, 2:17 PM IST

Gyanvapi mosque survey: ఉత్తర్‌ ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞాన్​వాపి మసీదు-శృంగార్‌ గౌరీ ప్రాంగణంలో జరుగుతున్న వీడియోగ్రఫీ సర్వే ప్రశాంతంగా ముగిసింది. మసీదులో 3 రోజుల సర్వేకు వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు ఆదేశించగా విచారణకు ఒక రోజు ముందే ఆ ప్రక్రియ పూర్తైంది. ప్రార్థన స్థలంలోని మూడు గోపురాలు, భూగర్భ నేలమాళిగలు, చెరువు తదితర ప్రదేశాలను సర్వే బృందం వీడియో తీసింది. ఈ సందర్భంగా మసీదులోని కొలనులో శివలింగం కనిపించినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై ముగ్గురు కమిషన్ సభ్యులు తయారు చేసే నివేదికను.. అడ్వకేట్‌ కమిషనర్ మంగళవారం కోర్టులో సమర్పించనున్నట్లు ప్రభుత్వం న్యాయవాది ఒకరు తెలిపారు.

జ్ఞాన్​వాపి ప్రాంగణంలో శివలింగం ఉన్నట్టు సమాచారం బయటకు వచ్చిన నేపథ్యంలో సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా సీల్ చేయాలని ఆదేశించింది. జ్ఞాన్​వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు నిత్యం పూజలు చేసుకునేందుకు.. అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలివ్వగా సోమవారం ఈ ప్రక్రియ ముగిసింది. మరోవైపు.. జ్ఞాన్​వాపి మసీదులో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది.

ఇదీ చూడండి: 'జ్ఞాన్​వాపీ కేసుతో భయంగా ఉంది'.. కుటుంబ భద్రతపై జడ్జి ఆందోళన

భారీ బందోబస్తు నడుమ.. జ్ఞాన్​వాపీ మసీదు సర్వే షురూ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.