ETV Bharat / bharat

మోదీ కంచుకోట మరింత దృఢం.. భాజపా విజయానికి 10 కారణాలివే... - గుజరాత్ వార్తలు

గుజరాత్​లో కమలం మరోసారి సత్తా చాటింది. వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 156 సీట్లను గెలుచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అన్నీ తానై ఈ ఎన్నికల్లో భాజపా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లి సఫలీకృతమయ్యారు. వీటితో పాటు పలు అంశాలు భాజపా గెలుపునకు దోహదపడ్డాయి. అవేంటంటే?

GUJARAT ELECTION 2022 RESULTS
GUJARAT ELECTION 2022 RESULTS
author img

By

Published : Dec 8, 2022, 2:15 PM IST

Updated : Dec 8, 2022, 6:03 PM IST

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా గుజరాత్​ను ఏలుతున్న భాజపా మరోసారి విజయకేతనం ఎగురవేసింది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. మొత్తం 182 స్థానాలకు 156 స్థానాల్లో గెలుపొంది సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా స్వరాష్ట్రం కావడం వల్ల ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే భాజపా విజయానికి దారితీసిన కారణాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

GUJARAT ELECTION 2022 RESULTS
కమలం విజయానికి పది కారణాలు

ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గుజరాత్‌లో భాజపా దూకుడుగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా ఏడోసారి విజయం సాధించింది. మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతతోపాటు, బరిలో కొంతమంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి దిగినా.. మోదీ చరిష్మాతో భాజపా విజయకేతనం ఎగురవేసింది. 'ఈ గుజరాత్‌ను నేనే తీర్చిదిద్దాను' అనే కొత్త నినాదంతో ప్రధాని మోదీ.. గుజరాత్ ఓటర్లను ఆకట్టుకున్నారు. 'భాజపా అభ్యర్థి ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.. కమలం పువ్వుకు ఓటు వేయాలి' అని ఆయన కోరారు. అలాగే భాజపాకు వేసే ఓటు మోదీ ఖాతాలో పడుతుందని ఓటర్లలో సెంటిమెంట్​ను రాజేశారు.

భాజపా వైపు మళ్లిన పాటీదార్లు..
గుజరాత్‌ జనాభాలో పాటీదార్ల సంఖ్య సుమారు 15 శాతం. 1990 నుంచి పాటీదార్లు భాజపాకు మద్దతుగా ఉన్నారు. అయితే 2015లో హార్దిక్‌ పటేల్‌ సారథ్యంలో జరిగిన పాటీదార్ ఉద్యమాన్ని భాజపా అణిచివేసింది. ఉద్యమ సమయంలో జరిగిన పోలీసు కాల్పుల్లో అనేకమంది పాటీదార్‌ యువకులు చనిపోయారు. దీంతో పటేళ్లకు, భాజపాకు మధ్య అంతరం పెరిగింది. 2017 ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ వైపు పాటీదార్ల మళ్లారు. అది భాజపాకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. 2017 ఎన్నికల్లో భాజపా 99 సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ 77 సీట్లు గెలుచుకుంది.

అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం భాజపా.. పటేల్​ ఓటర్ల విషయంలో జాగ్రత్త పడింది. పటేల్‌ల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కొవిడ్‌ అనంతరం ముఖ్యమంత్రి విజయ్​ రూపాణీని మార్చి.. భూపేంద్ర పటేల్‌కు పగ్గాలు అప్పగించింది. అలాగే పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్​ను పార్టీలో చేర్చుకుని.. ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ల రూపంలో పటేల్‌లకు సాయం అందుతుందని భాజపా ప్రచారం చేసింది. ఈ అంశాలన్నీ భాజపాకు పాటీదార్లను దగ్గర చేశాయి.

దళిత ఓట్లను పొందడంలో భాజపా సఫలం..
గుజరాత్‌ జనాభాలో దళితులు 8శాతం. రాష్ట్రంలో 13 ఎస్సీ రిజర్వుడ్​ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 1995 నుంచీ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను భాజపాయే దక్కించుకుంటోంది. 2017లో మాత్రం భాజపా.. ఎస్సీ రిజర్వుడ్​ నియోజకవర్గాల్లో వెనకబడిపోయింది. మొత్తం 13 స్థానాల్లో ఏడింటిని భాజపా గెల్చుకోగా, హస్తం పార్టీ ఐదింటిని సొంతం చేసుకుంది. అయితే 2022 ఎన్నికల్లో మాత్రం భాజపా దళిత ఓటర్లను ఆకట్టుకుంది. పలువురు దళిత నేతలకు వివిధ ప్రభుత్వ సంస్థల్లో పదవులు కట్టబెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు భాజపాకు కొంత మేర లబ్ధి చేకూర్చాయి.

గిరిజనుల ఓట్లను పొందడంలో భాజపా సఫలం..
గుజరాత్​లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భాజపా.. ఆదివాసీ ఓట్లు, సీట్లు గెలుచుకోవడంలో మాత్రం వెనకబడే ఉంది. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌ పార్టీ వైపే ఇప్పటిదాకా మొగ్గు చూపుతూ వస్తున్నారు. అధికారాన్ని అందుకోలేకపోతున్నా.. ఆదివాసీల ఓట్లు, సీట్లను మాత్రం కాంగ్రెసే ఎక్కువగా సాధిస్తోంది. అయితే 2017 ఎన్నికల్లో 27 రిజర్వుడ్‌ సీట్లకుగాను కాంగ్రెస్‌ 15 గెల్చుకోగా.. భాజపా ఎనిమిదింటిలో మాత్రమే నెగ్గింది. ఈసారి ఆదివాసీ సీట్లను భాజపా గెలుపొందేందుకు తీవ్రంగా కృషి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రెస్ నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్‌సిన్హ్‌ రత్వాను పార్టీలో చేర్చుకుంది భాజపా. ఆయనకు గిరిజన ఓటు బ్యాంకుపై మంచి పట్టుండడం భాజపాకు కలిసొచ్చింది.

ఆప్ రూపంలో చీలిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు..
గుజరాత్​ పోరులో ఆప్ తన శాయశక్తులా ప్రయత్నించింది. ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 2017 ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపని ఆప్​.. 2022లో ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అనేక నియోకవర్గాల్లో భాజపా లాభపడింది. భాజపా ఓట్లు కొంతమేర ఆప్​కు మళ్లినా.. కాంగ్రెస్ ఓట్లనే ఆప్​ ఎక్కువగా గండికొట్టింది. అయితే భాజపాకు ప్రత్యామ్నాయంగా ఆప్ అనే భావన విద్యావంతుల్లో రావడం వల్ల కాంగ్రెస్ ఓట్లు భారీగా చీలాయి.

సిట్టింగ్​ ఎమ్మెల్యే స్థానంలో.. కాంగ్రెస్ నుంచి చేరినవారికి టికెట్లు
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టి కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన ఎమ్మెల్యేలకు భాజపా టిక్కెట్లు ఇచ్చింది. అహ్మదాబాద్‌ నగరంలో ముఖ్యమంత్రికి, మరో ఎమ్మెల్యేకు మినహా పాతవారికి టికెట్లు నిరాకరించిన భాజపా అధిష్ఠానం.. రాష్ట్రం మొత్తం మీద 62 మంది కొత్తవారికి స్థానం కల్పించింది. టికెట్లు పొందలేనివారిలో అనేకమంది మంత్రులు ఉన్నారు. వీరిపై వ్యతిరేకత పార్టీపై పడకుండా జాగ్రత్త పడకుండా అధిష్ఠానం జాగ్రత్త పడింది. ఈ నిర్ణయం కూడా భాజపా విజయంలో కీలక పాత్ర పోషించింది.

భాజపాకు లాభం చేకూర్చిన కాంగ్రెస్ వైఫల్యాలు..
2022 గుజరాత్​ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో బాగా వెనకబడిపోయింది. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ఎండగట్టడంలోనూ విఫలమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకటి రెండు సభల్లో మాత్రమే పాల్గొన్నారు. ఆయన భారత్​ జోడో యాత్రలో నిమగ్నమయ్యారు. అలాగే కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్​, ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​, మధ్యప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్.. ఈ ఎన్నికలను సీరియస్​గా తీసుకోలేదనే విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్.. భాజపా వైఫల్యాలను ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లకపోవడం వల్ల భాజపాకు విజయం మరింత సులువైంది.

సీఎం మార్పుతో లాభం..
ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడం, సామాజిక సమీకరణాల సంతులనంలో భాగంగా 2021 సెప్టెంబరులో విజయ్‌ రూపాణీ స్థానంలో భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిని చేయడం వల్ల భాజపాకు లాభం చేకూరింది. ఈ నిర్ణయంతో పటేళ్లు భాజపావైపు మొగ్గు చూపారు. అలాగే ఈ సారి ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే మరోసారి భూపేంద్ర పటేల్​నే సీఎంగా కొనసాగిస్తామని భాజపా ప్రకటించింది. ఈ ప్రకటన వల్ల పటేళ్ల ఓటర్లు భాజపా వైపు మొగ్గు చూపేందుకు దోహదపడింది.

ప్రత్యర్థుల ఉచితాల హామీలను ఎదుర్కొనేందుకు వ్యూహం
గుజరాత్ ఎన్నికలో బరిలో దిగిన కాంగ్రెస్, ఆప్ ఓటర్లపై ఉచిత తాయిళాలు కురిపిస్తే.. భాజపా మాత్రం ఆ జోలికి పోకుండా జాగ్రత్త పడింది. ఆ రెండు పార్టీలు ఉచిత విద్యుత్​, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఇచ్చినా.. భాజపా ఎక్కడా ఆ ట్రాప్​లో పడలేదు. ఎక్కడ ఉచిత హామీలు ఇవ్వకుండా దేశభద్రత, అభివృద్ధి నినాదంలో ప్రచారంలో ప్రధాన ఎజెండాగా చేసుకుంది. ఓటర్లను ఉచితాలవైపు మొగ్గు చూపకుండా జాగ్రత్త పడింది. ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే ఉచితాలపై ఆప్, కాంగ్రెస్​ పార్టీలను విమర్శించేవారు. ఇలాంటి హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు ఓటర్లు ఆకర్షితులయ్యారు. ఉచిత కరెంట్​​ ఇవ్వడానికి బదులు.. విద్యుత్​తోనే ప్రజలు సంపాదించుకునేలా చేస్తానని ప్రధాని మోదీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ ప్రజలు నమ్మి.. భాజపాను 2022 ఎన్నికల్లో ఆదరించారు.

హిందుత్వ అజెండా.. అభివృద్ధి నినాదం
గుజరాత్ ఎన్నికల్లో భాజపా హిందుత్వ నినాదాన్ని వినిపించింది. మేనిఫెస్టోలోనూ ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ద్వారకాను పశ్చిమ భారతదేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని.. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీ కృష్ణుడి విగ్రహం, త్రీడీ భగవద్గీత ఎక్స్​పీరియెన్స్ జోన్​తో పాటు గ్యాలరీ నిర్మాణం చేపడతామన్న హామీలు భాజపాకు కలిసి వచ్చాయి. హిందూ ఓటర్లు.. భాజపావైపు మొగ్గు చూపేందుకు ఈ హామీలు కారణమయ్యాయి.

Last Updated : Dec 8, 2022, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.