కేరళలో ఓ జ్యోతిషుడు చెప్పిన మాటలు నమ్మిన యువతి తన భర్తకి విషం ఇచ్చి చంపింది. వివాహం జరిగితే తన మొదటి భర్త చనిపోతాడని జ్యోతిషుడు చెప్పగా.. ఆ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. ఈ కేసును పోలీసులు విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురంలోని పరశాలలో నివసించే షారన్ సెప్టెంబర్ 14న హత్య గురయ్యాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు షారన్ మృతి పట్ల అనుమానంతో.. తమిళనాడులోని రామవర్మంచిరలోని అతని ప్రేయసి గ్రీష్మాపై కేసు నమోదు చేశారు. పోలీసులు 8 గంటల పాటు గ్రీష్మను విచారించగా విస్తుపోయే నిజాల్ని వెల్లడించింది. వివాహం జరిగితే మొదటి భర్త చనిపోతాడని జ్యోతిషుడు చెప్పిన నేపథ్యంలో.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపింది. అయితే తాము గతంలో ఎవరికీ తెలియకుండా ఓ చర్చిలో వివాహం చేసుకున్నారని తెలిపింది.
గ్రీష్మకు మరో యువకుడితో ఫిబ్రవరిలో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిశ్చయించారు. అయితే.. మొదటి భర్త చనిపోతాడని జ్యోతిషుడు చెప్పినందుకే షారన్‌ను హత్య చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన తమిళనాడులోని రామవర్మంచిర్లో ఉన్న గ్రీష్మా ఇంటికి వెళ్లి ఆరోగ్యంగా తిరిగి వచ్చాడు. అయితే అక్కడ వారు జ్యూస్ తాగే పోటీని పెట్టుకున్నారు. గ్రీష్మా.. షారన్‌కు ఇచ్చిన జ్యూస్‌లో కాపర్ సల్ఫేట్ కలిపి ఇచ్చింది. అది తాగిన షారన్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషం తాగిన కారణంగానే షారన్ మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది. ఈ విషయాన్ని రుజువు చేసేలా గ్రీష్మా, షారన్ మధ్య వాట్సాప్ చాటింగ్‌లు లభించాయి. అమ్మాయితో బయటకు వెళ్లిన ప్రతీసారి షారన్‌కు కడుపునొప్పి వచ్చేదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వారిద్దరూ కలిసిన ప్రతీ సారి షారన్‌కు విషం కలిపిన జ్యూస్ ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.