ETV Bharat / bharat

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా గులాం నబీ ఆజాద్ - కాంగ్రెస్​కు గులాం నబీ ఆజాద్ రాజీనామా

Ghulam Nabi Azad New Party కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన వేరే పార్టీలో చేరేది లేదని ఆయన సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు.

Ghulam Nabi Azad is going to float a new political party

author img

By

Published : Aug 26, 2022, 4:19 PM IST

Updated : Aug 27, 2022, 9:41 AM IST

Ghulam Nabi Azad New Party: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ తదుపరి వ్యూహమేంటి? ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీలో చేరతారా? సొంత పార్టీ పెడతారా? రాజకీయాలకు పూర్తిగా దూరమవుతారా? ఇప్పుడివే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. అయితే.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన ఆజాద్.. కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితుడు ఒకరు ఈటీవీ భారత్​తో ఈ విషయం చెప్పారు.

'ఆజాద్ భాజపాలో లేదా మరే ఇతర పార్టీలో చేరరు. కొత్త పార్టీని స్థాపించే అవకాశం ఉంది. కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మీరు మరిన్ని రాజీనామాలను చూస్తారు. వారందరూ ఆజాద్ వెంట నడుస్తారు.'

--ఆజాద్ సన్నిహితుడు

గులాం నబీ ఆజాద్ రాజీనామాకు మద్దతుగా జమ్ముకశ్మీర్​కు చెందిన పలువురు కాంగ్రెస్​ నేతలు రాజీనామా చేశారు. వారిలో జి.ఎం. సరూరీ, హాజీ అబ్దుల్ రషీద్, మహ్మద్ అమీన్​ భట్, గుల్జార్ అహ్మద్ వాణీ, చౌదరి మహ్మద్ అక్రమ్​ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్​ ప్రాథమిక సభ్యత్వం సహా పార్టీలోని అన్ని పదవులకు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం ఉదయం రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అగ్రనేత రాహుల్​ గాంధీ వ్యవహార శైలి సహా పార్టీ అధినాయకత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆజాద్.

'చేయాల్సింది భారత జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్ జోడో​ యాత్ర'
"ఏఐసీసీని నడిపే కోటరీ ఆధ్వర్యంలో పోరాడాలన్న సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. భారత్​ జోడో యాత్ర కన్నా ముందు పార్టీ​ అధినాయకత్వం కాంగ్రెస్​ జోడో యాత్రను చేపట్టాల్సింది" అని గులాం నబీ ఆజాద్​ దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్‌కు కష్టాలు ఆరంభమయ్యానని ఆజాద్‌ ఆరోపించారు. రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని, అనుభవజ్ఞులైన నేతలను రాహుల్‌ పక్కకు పెడుతున్నారంటూ విమర్శించారు ఆజాద్‌. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకొని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. పార్టీలోని సంస్థాగత మార్పుల కోసం లేఖ రాసిన 23 మంది నేతలను తీవ్రంగా అవమానించారని అని ఆయన అన్నారు.

సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వివిధ అంశాలపై భాజపాతో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీ వీడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. "గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ సీనియర్ నేత. ద్రవ్యోల్బణం, విభజన రాజకీయాలు, పలు అంశాలపై భాజపాతో పోరాడుతోన్న సమయంలో ఆయన పార్టీని వీడటం విచారకరం, దురదృష్టకరం" అని కాంగ్రెస్‌ పేర్కొంది. అలాగే ఈ రాజీనామా లేఖలోని విషయాలను ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. అవి వాస్తవం కాదన్నారు. మరోవైపు, గులాం నబీ ఆజాద్​ తమ పార్టీలోకి ఆహ్వానించారు భాజపా నేత కుల్​దీప్ బిష్ణోయ్.

ఇవీ చదవండి: ఆ విషయంలో బాధగా ఉందన్న జస్టిస్ రమణ, రిటైర్మెంట్​ రోజున కీలక వ్యాఖ్యలు

ప్రేమను నిరాకరించారని మనస్తాపం, వివాహిత ఆత్మహత్య

Last Updated : Aug 27, 2022, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.