ETV Bharat / bharat

అరగుండుతో యువతి ఊరేగింపు కేసులో మరో ట్విస్ట్​.. ఆమె సోదరిపై కూడా! - మహిళను అరగుండుతో ఊరేగించిన ఘటన

దిల్లీ యువతిని చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులు తనను కూడా లైంగికంగా హింసించారని బాధితురాలు సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Gang Rape In Delhi
అత్యాచారం
author img

By

Published : Jan 31, 2022, 11:10 AM IST

Gang Rape In Delhi: దిల్లీ కస్తూర్బా నగర్ కాలనీలో యువతిపై దాడి చేసి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన మరో మలుపు తిరిగింది. నిందితులు తనను కూడా లైంగికంగా హింసించారని బాధితురాలి చెల్లెలు(18) ఆరోపించింది. తన సోదరి ఘటనకు కొన్ని రోజుల ముందే తననూ వేధించారని పోలీసులకు తెలిపింది. జనవరి 19న దాడి చేసి, తన ఆటోకు కూడా నిప్పంటించారని ఫిర్యాదులో పేర్కొంది. ' ఇంట్లో ఉంటే నిందితులు బయటకులాగి కొట్టారు. పనిచేసే ప్రదేశానికి వెళితే.. అక్కడా వేధించారు. నా జీవనాధారాన్ని దెబ్బతీశారు. ఇలా అయితే కుటుంబపోషణ ఎలా?' అని ఫిర్యాదులో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

దీనిపై స్పందించిన దిల్లీ డీసీపీ సత్యసుందరం.. నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని చెప్పారు. మరో కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

దిల్లీ ఘటన..

Woman Paraded Naked in Delhi: దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. కస్తూర్బా నగర్‌లో 20ఏళ్ల యువతిని కొందరు లైంగికంగా వేధించి చిత్ర హింసలకు గురిచేశారు. ఆపై బాధితురాలికి అరగుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి, మొహానికి నల్ల రంగు పూసి వీధిలో ఊరేగించారు. నిందితుల్లో మహిళలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ స్వాతి మలివాల్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అక్రమంగా మ‌ద్యం అమ్మేవాళ్లు యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన‌ట్లు ఆమె ఆరోపించారు. బాధితురాలిని కొట్టుకుంటూ ఊరేగించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: మహిళపై లైంగిక వేధింపులు- జుట్టు కత్తిరించి, చెప్పుల దండతో ఊరేగింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.