ETV Bharat / bharat

మహిళపై లైంగిక వేధింపులు- జుట్టు కత్తిరించి, చెప్పుల దండతో ఊరేగింపు! - దిల్లీలో మహిళపై గ్యాంగ్ రేప్​

Gang Rape In Delhi: దిల్లీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళను లైంగికంగా వేధించి, జుట్టు కత్తిరించి, ముఖాన్ని నల్లగా మార్చి, చెప్పుల దండను మెడలో వేసి వీధుల్లో తిప్పారు నిందితులు. ఈ కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.

gangrape
గ్యాంగ్​రేప్
author img

By

Published : Jan 27, 2022, 1:43 PM IST

Updated : Jan 27, 2022, 3:46 PM IST

Gang Rape In Delhi: దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. కస్తూర్బా నగర్‌లో 20ఏళ్ల యువతిని కొందరు లైంగికంగా వేధించి చిత్ర హింసలకు గురిచేశారు. ఆపై బాధితురాలికి అరగుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి మొహానికి నల్ల రంగు పూసి వీధిలో ఊరేగించారు. నిందితుల్లో మహిళలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ స్వాతి మలివాల్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అక్రమంగా మ‌ద్యం అమ్మేవాళ్లు యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన‌ట్లు ఆమె ఆరోపించారు. బాధితురాలిని కొట్టుకుంటూ ఊరేగించిన మ‌హిళ‌ల్ని కూడా అరెస్టు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

మరోవైపు స్వాతి పోస్టును రీట్విట్‌ చేసిన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఇది ఎంతో సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించేలా పోలీసులకు ఆదేశిలివ్వాలని హోంమంత్రి అమిత్‌షా, దిల్లీ గవర్నర్‌ను కోరారు.

అయితే యువతిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తుల్ని బుధవారమే అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆమె అత్యాచారం జరగలేదని, లైంగికంగా వేధించి హింసించారని తెలిపారు. బాధితురాలిపై ఉన్న వ్యక్తిగత కక్ష్యతోనే మహిళలు దాడి చేసినట్లు దిల్లీ డిప్యూటీ కమిషనర్‌ సత్య సుందరం స్పష్టం చేశారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితురాలు.. నిందితుల కుటుంబానికి చెందిన అబ్బాయి స్నేహితులు. అయితే గతేడాది నవంబర్​లో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు కారణం ఈ యువతే అని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమె వల్లే తమ అబ్బాయి బలవన్మరణానికి పాల్పడ్డారని చెబుతున్నారు. అప్పటి నుంచి యువతిపై కక్ష పెంచుకున్నారు.

బుధవారం బాధిత మహిళ భర్త లేని సమయం చూసి ఆమెను అపహరించారు. అనంతరం ఆమెపై దాడి చేశారు. వీరంతా బాధితురాలి తల్లి నివాసముండే కస్తుర్బా నగర్​లోనే ఉంటున్నారు. అక్కడికే యువతిని తీసుకెళ్లి క్రూరంగా ప్రవర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: విద్యార్థినిపై ఇద్దరు సహచర బాలురు అత్యాచారం!

Last Updated : Jan 27, 2022, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.