ETV Bharat / bharat

పొలంలో మలవిసర్జన చేయొద్దన్నందుకు మూక దాడి.. ఇద్దరు మృతి - మహారాష్ట్ర పోలంలో మల విసర్జన

తమ పొలంలో మలవిసర్జన చేయొద్దన్నందుకు ఓ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన మరో కుటుంబం దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు బాధితులు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మిగతావారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జల్నా జిల్లాలో జరిగింది.

double
double
author img

By

Published : Jul 16, 2022, 10:54 PM IST

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో టాయిలెట్​ విషయంలో వివాదం తలెత్తి ఓ కుటుంబంపై మరో కుటుంబానికి చెందిన సభ్యులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే తమ పొలంలో మలవిసర్జన చేయొద్దన్నందుకే దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.

ఇదీ జరిగింది.. జిల్లాలోని అమంచి తండా గ్రామంలో దేవిలాల్ సిల్లోడ్‌ కుటుంబానికి కొంత పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన శిందే కుటుంబంలోని కొందరు పిల్లలు సిల్లోడ్​ కుటుంబానికి చెందిన పొలంలోనే నిత్యం మలవిసర్జన చేస్తుంటారు. అయితే దీనిని సిల్లోడ్​ కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. తమ పొలంలో టాయిలెట్​కు రావొద్దని హెచ్చరించారు.

అయితే శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తమ పిల్లలను మలవిసర్జన చేయొద్దన్నందుకు సిల్లోడ్​ కుటుంబసభ్యులపై పది మంది శిందే కుటుంబీకులు దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుల్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే తీవ్ర గాయాలతో ఇద్దరు చనిపోయారు. మృతులను సుమన్​ భాయ్​​ సిల్లోడ్​, మంగేశ్​ సిల్లోడ్​గా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. శిందే కుటుంబంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి: దొంగల బీభత్సం.. 17 ఏటీఎంలు క్లోజ్.. గ్రామస్థులకు తిప్పలు!

రోడ్లపై జంతువులు హల్​చల్.. వృద్ధుడు మృతి.. చిన్నారికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.