నదీ స్నానం కోసం వెళ్లిన నలుగురు పిల్లలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా మంగ్రోధి గ్రామంలో జరిగింది. మృతుల్లో ముగ్గురు స్థానికులు. మరొ బాలిక వేరే గ్రామానికి చెందినదని.. ఛత్‌పూజ జరుపుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
ఛత్‌పూజ నేపథ్యంలో సమీపాన ఉన్న ఉశ్రీ నదిలో సోనౌవ కుమార్, సోనాక్షి కుమారి, సోహాని కుమారి సహా మరో బాలిక పుణ్యస్నానాలకు వెళ్లారు. ఎంతసేపైనా పిల్లలు తిరిగి రాకపోవడం వల్ల కుటుంబసభ్యులు నదీ తీరానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నీట మునిగిన చిన్నారులను గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
లోతు ఎక్కువగా ఉన్న చోటకు పిల్లలు వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి : ఆరేళ్ల బాలుడిని హత్య చేసిన యువకుడు.. మేడపైకి తీసుకెళ్లి..