ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌లో ఘోరం జరిగింది. మట్టిని తెచ్చేందుకు కాలువ దగ్గరకు వెళ్లిన ఐదుగురు బాలికలు.. నీటిలో మునిగి మృతి చెందారు. పేమపుర్ కజూరి గ్రామంలో శనివారం జరిగిందీ దుర్ఘటన. విషయం తెలుసుకున్న స్థానికులు.. ఘటనా స్థలానికి చేరుకుని నలుగురు బాలికల మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మరో బాలిక కోసం గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఐదుగురు బాలికలు మట్టిని తెచ్చేందుకు కాలువ దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువలో పడి ఐదుగురు బాలికలు మరణించారు. మృతులతో వెళ్లిన మరికొందరు బాలికలు గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని బాలికల మృతదేహాలను వెలికితీశారు. ఘటనా స్థలికి చేరుకునన్న పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు సీఎం యోగి.
డంపర్‌ను ఢీకొట్టిన వ్యాన్..
ఉత్తర్‌ప్రదేశ్ హమీర్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన డంపర్.. ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యానులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. కబ్రాయ్ సాగర్ రోడ్డులోని మౌదాహ కూడలిలో శనివారం జరిగిందీ ఘటన. మృతులను లఖన్‌లాల్ (35), పవన్ (29), రాహుల్ (19)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత డంపర్ డ్రైవర్ పరారయ్యాడని తెలిపారు. డంపర్‌ను సీజ్ చేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: పోలీస్ స్టేషన్లో వందేమాతరం పాడుతూ మార్చ్ఫాస్ట్ చేసిన తాగుబోతు