firefight broke out in Pulivendu of YSR district: వైఎస్సార్ జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల మోతలు కలకలం రేపాయి. ఓ ఘర్షణ కారణంగా భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి తుపాకీతో ఇద్దరు వ్యక్తులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో దిలీప్, మహబూబ్ బాషా అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటహుటినా పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. మార్గమాధ్యలో దిలీప్ మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన వైఎస్సార్ జిల్లా పులివెందులలో తుపాకీ కాల్పుల మోతలు ఆ ప్రాంత నివాసులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేశాయి. ఆర్థికలావాదేవీల కారణంగా భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి తన వద్దనున్న తుపాకీతో ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తీసుకెళ్తుండగా దారి మార్గమాధ్యలో దిలీప్ మృతి చెందాడు. భరత్ కుమార్, దిలీప్‌ల మధ్య ఉన్న ఆర్థిక వివాదాలే ఈ ఘటనకు దారి తీశాయని అధికారులు గుర్తించారు.
ఆర్థికలావాదేవీల విషయంలో గతం వారం రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయని.. ఈరోజు పులివెందుల వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మరోసారి భారీ వాగ్వాదం జరిగి ఈ ఘటనకు దారి తీసిందని బాధితులు తెలిపారు. ఆగ్రహంతో రగిలిపోయిన భరత్ కుమార్.. ఇంటికి వెళ్లి తుపాకీని తెచ్చుకొని మరీ.. కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఇద్దరినీ కాల్చిన తర్వాత అక్కడి నుంచి భరత్ కుమార్ యాదవ్ పరారైనట్లు తెలిపారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి గతంలో భరత్ కుమార్‌ను సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్ బంధువే భరత్ కుమార్ యాదవ్ అని సీబీఐ వెల్లడించింది.
ఈ క్రమంలో పులివెందుల పట్టణంలో గొర్రెల వ్యాపారం చేసుకునే దిలీప్‌తో ఆర్థికలావాదేవీలు ఉండగా.. గతవారం రోజులుగా ఇద్దరూ డబ్బుల విషయంలో పదే పదే గొడవపడుతున్నట్లు పలువురు స్థానికులు తెలిపారు. గొర్రెల వ్యాపారి దిలీప్.. భరత్ కుమార్ యాదవ్‌కు అప్పు ఉండటంతో ఆ విషయంలో ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పులివెందులలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పుల మోత రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటన సమయంలోనే దిలీప్ స్నేహితుడు మహబూబ్ బాషా అక్కడే ఉండడంతో వారిద్దరిని అడ్డుకొనే ప్రయత్నం చేశాడు. దీంతో భరత్ కుమార్ యాదవ్.. అతడిపైనా కూడా కాల్పులు జరిపాడు. గాయాలతో ఇద్దరు ఆలయం మెట్ల వద్ద కింద పడిపోవడంతో భరత్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి తుపాకీతో పరారైనట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మార్గమాధ్యలో దిలీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతను మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భరత్ కుమార్‌పై కేసు నమోదు చేసినా పోలీసులు.. భరత్ కుమార్ యాదవ్‌కు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది?, ఎవరి వద్ద విక్రయించాడు? అనే విషయాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి