ETV Bharat / bharat

పార్కింగ్ ప్రదేశంలో 20 కార్లు దగ్ధం.. స్కూల్​ బస్సులో మంటలు.. 19 మంది.. - దిల్లీలో అగ్ని ప్రమాదం

బహుళ అంతస్తు పార్కింగ్ సముదాయంలో ఓ యువకుడు కారుకు నిప్పంటించాడు. దీంతో ఆ పార్కింగ్ సముదాయంలో ఉన్న 20 కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన గుజరాత్​లో జరిగింది. అగ్నిమాపక దళాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

fire accident in delhi
అగ్ని ప్రమాదం
author img

By

Published : Dec 26, 2022, 9:06 PM IST

పశ్చిమ దిల్లీ.. సుభాష్​నగర్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయంలోని కారుకు నిప్పు పెట్టాడు ఓ యువకుడు. దీంతో మంటలు వ్యాపించి పార్కింగ్​ సముదాయంలో ఉన్న 20 కార్లు దగ్ధమయ్యాయి. సోమవారం వేకువజామున జరిగిందీ ఘటన. ఈ ఘటనపై పోలీసులకు వాహన యజమాని ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు యశ్ అరోరా(23)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వాహన యజమానిపై కోపంతో యువకుడు అతడి ఎర్టిగా కారుకు నిప్పంటించాడు. ఈ క్రమంలో 20 కార్లకు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ఏడు ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

స్కూల్ బస్సులో మంటలు..
గుజరాత్ సూరత్​లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్​ ప్రయాణికులను కిందకు దింపాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ బస్సులో ఉద్యోగులు, చిన్నారులు సహా 19 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు.

school bus fire accident
స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు
school bus fire accident
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక దళాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.