ETV Bharat / bharat

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాలకు మేలు: మోదీ - gdp

కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో సమాజంలోని అన్ని వర్గాలకూ మేలు కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే చేపట్టిన చర్యలకు గురువారం నాటి ప్యాకేజీతో ఊతం లభిస్తుందని ట్వీట్​ చేశారు.

Financial package continues govt's efforts to help all sections of society: PM
ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాలకు మేలు: మోదీ
author img

By

Published : Nov 13, 2020, 5:18 AM IST

సమాజంలోని అన్ని వర్గాలకు సాయం చేయడానికే ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్రం మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని.. ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉద్యోగాల సృష్టి, దెబ్బతిన్న రంగాలకు ఊతం, తయారీని పెంచటం, స్థిరాస్తి రంగానికి ప్రోత్సాహం సహా రైతులకు మద్దతు ఇచ్చేందుకు ఈ ప్యాకేజీ ఎంతగానే సాయం చేస్తుందని ట్విట్టర్‌లో మోదీ పేర్కొన్నారు.

modi tweet
మోదీ ట్వీట్​

దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ఉపకరించే ఏ ఒక్క ప్రయత్నాన్నీ ప్రభుత్వం విడనాడడం లేదని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: ఆత్మనిర్భర్​ భారత్​ 3.0: ఉపాధి కల్పనకు పెద్ద పీట

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మూడో ప్యాకేజీని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. గృహ అమ్మకాలపై పన్ను ఉపశమనం, చిన్న వ్యాపారాలకు క్రెడిట్ గ్యారెంటీ, ఆర్థిక వ్యవస్థకి ఊతం ఇవ్వటంతో పాటు కొత్త ఉద్యోగ కల్పనకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. 2.65 లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ఆర్థికమంత్రి ప్రకటించారు.

ఇదీ చూడండి: 'మధ్యతరగతి'కి కేంద్రం 'ఆత్మనిర్భర్​' కానుక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.