ETV Bharat / bharat

Festivals in November 2023 : అట్లతద్ది నుంచి.. దీపావళి దాకా.. నవంబరులో ఎన్ని పండగలు, వ్రతాలు ఉన్నాయో తెలుసా..? - పండుగలు నవంబర్ 2023లో

Festivals In November 2023 Complete List : హిందూ సంప్రదాయంలో.. పండగలు, వ్రతాలకు విశిష్ట స్థానం ఉంది. అందుకే.. ప్రతినెలా పండగలు, వ్రతాలు, నోములు ఉంటూనే ఉంటాయి. మరి.. ఈ నవంబర్ నెలలో ప్రధాన పండుగలతోపాటు.. నోములు, వ్రతాలు కూడా చాలానే ఉన్నాయి. వాటి వివరాలేంటో.. ఈ స్టోరీలో చూద్దాం.

Festivals in November 2023
Festivals in November 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 3:43 PM IST

Festivals In November 2023 Complete List : ఆచారాలు సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిళ్లు. ఇక్కడ హిందూ క్యాలెండర్‌ ప్రకారం.. ప్రతినెలా కొన్ని వ్రతాలు, పండుగలు జరుపుకునే తిథులు ఉంటాయి. అయితే.. ఈ నవంబర్‌ నెలలో పండగలు, నోములు, వ్రతాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి, అవి ఏంటి..? ఏయే రోజుల్లో ఉన్నాయి? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • కర్వా చౌత్, అట్ల తద్ది (నవంబర్ 1) : ఉత్తర భారతంలో కర్వా చౌత్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగను అట్లతద్దిగా జరుపుకుంటారు.
  • కాలాష్టమి (5 నవంబర్) : తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తల్లులు కాలాష్టమి రోజున ఉపవాసం ఉంటారు.
  • రామ ఏకాదశి (9 నవంబర్) : హిందూ పంచాంగంలో ప్రతి నెలలోనూ ఏకాదశి వస్తుంది. కానీ, అశ్విని మాసంలోని క్రిష్ణ పక్షంలో దీపావళికి ముందు వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏకాదశినే రామ ఏకాదశి అంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని భావిస్తుంటారు.
  • ధంతేరాస్ (10 నవంబర్) :దీపావళికి ముందు జరుపుకునే ప్రధానమైన పండుగ ధన త్రయోదశి. ఈ రోజున కుబేరుడు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల శుభాలు, అష్టశ్వైర్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. ఆయుర్వేద పితామహుడిగా ధన్వంతరిని పరిగణిస్తారు. ధన్వంతరి జన్మదినం సందర్భంగా ఈ రోజున పూజలు చేస్తారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఆ దేవుడు కాపాడతాడని భక్తులు నమ్ముతారు.
  • కాళీ చౌదాస్ (11 నవంబర్) : కాళీ చౌదాస్, హనుమాన్ పూజ, నెలవారీగా వచ్చే శివరాత్రి.
  • దీపావళి (12 నవంబర్) : ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 12వ తేదీన ఆదివారం రోజున వస్తోంది. పురాణాల ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా.. తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో నరకాసురుడు దేవతలు, మునులు, గంధర్వులను ఇబ్బందులు పెడతాడు. వారు బాధను శ్రీహరికి వెళ్లబోసుకుంటారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపార యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేస్తాడు. ఆ రోజును దీపావళిగా జరుపుకుంటున్నారు.

Diwali Festival: లక్ష్మీదేవి వాళ్లనే వరిస్తుంది.. ఎందుకో తెలుసా?

  • 13 నవంబర్ 2023 : ఈ రోజున కార్తీక అమావాస్య జరుపుకుంటారు.
  • 14 నవంబర్ 2023 : గోవర్ధన్ పూజ, అన్నకూట్, భాయ్ దూజ్ పేరుతో ఉత్తర భారతంలో సెలబ్రేట్ చేసుకుంటారు.
  • 16 నవంబర్ 2023 : కార్తీక వినాయక చతుర్థి.
  • 17 నవంబర్ 2023 : నాగుల చౌత్, వృశ్చిక రాశి సంక్రాంతి.
  • 18 నవంబర్ 2023 : లభ పంచమి, స్కంద షష్ఠి.
  • 19 నవంబర్ 2023 : ఛత్ పూజ, భాను సప్తమి.
  • 20 నవంబర్ 2023 : గోపాష్టమి
  • 21 నవంబర్ 2023 : అక్షయ నవమి
  • 23 నవంబర్ 2023 : భీష్మ పంచకం ప్రారంభం, దేవుతాని ఏకాదశి
  • 24 నవంబర్ 2023 : తులసి వివాహం, యోగేశ్వర్ ద్వాదశి, శుక్ర ప్రదోష వ్రతం
  • 25 నవంబర్ 2023 : వైకుంఠ చతుర్దశి, విశ్వేశ్వర వ్రతం
  • 26 నవంబర్ 2023 : దేవ్ దీపావళి
  • 27 నవంబర్ 2023 : కార్తీక పూర్ణిమ, పుష్కర స్నానం, కార్తీక మాసం ముగింపు
  • 30 నవంబర్ 2023 : గణాధీప సంక్షోభ చతుర్థి

Karwa Chauth 2023: కర్వా చౌత్ ఉపవాసం.. ఇవి అస్సలే చేయకూడదు.. శుభముహూర్తం ఎప్పుడంటే?

నరక వధ వెలుగుల కథ దీపావళి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.