FDDI Jobs : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎఫ్‌డీడీఐ)లోని 62 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయింది( FDDI Recruitment 2023 ). అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీ లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు..
FDDI Jobs 2023 : 62 పోస్టులు
ఈ పోస్టులు..
FDDI Vacancy 2023 : డిప్యూటీ జనరల్ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్), జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ టెక్నాలజిస్ట్, సీనియర్ టెక్నాలజిస్ట్, అకౌంటెంట్, ఫ్యాకల్టీ, జూనియర్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ (గ్రేడ్-II).
విభాగాలు..
FDDI Jobs Departments : గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, కెమికల్ ల్యాబరేటరీ, ఫ్యాషన్ డిజైనింగ్, లెథర్ గూడ్స్ సహా ఇతర విభాగాలు.
విద్యార్హతలు..
FDDI Jobs Eligibility : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్, బీకామ్, బీఏ, డిప్లొమా , మాస్టర్స్ డిగ్రీ(ఎంబీఏ/ పీజీడీఎం) ఉత్తీర్ణత.
ఏజ్ లిమిట్..
FDDI Jobs Age Limit : 30 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం..
- స్కిల్‌టెస్ట్
- ఇంటర్వ్యూ
ఉద్యోగానికి షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఈ-మెయిల్ లేదా పోస్ట్ ద్వారా సమాచారం అందిస్తారు.
జీతభత్యాలు..
Footwear Designer Salary : ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.30,000 నుంచి రూ.1.5లక్షల వరకు వేతనాలు ఉంటాయి.
అప్లికేషన్ మోడ్..
FDDI Jobs Application Mode : ఆఫ్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్..
FDDI Address : చిరునామా- Faculty HO-HR, Administrative Block, 4th Floor, Room No. 406, FDDI, Noida, Uttar Pradesh 201301.
దరఖాస్తు చివరితేదీ..
FDDI Jobs Last date : ఆసక్తి గల అభ్యర్థులు 2023 సెప్టెంబర్ 5 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్సైట్..
FDDI Official Website : పూర్తి వివరాలు కోసం https://www.fddiindia.com/ ను చూడవచ్చు.
నేడే లాస్ట్ డేట్..
Bank Note Press Jobs 2023 : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ నోట్ ప్రెస్‌లో 111 పోస్టులను భర్తీకి సంబంధించి దరఖాస్తు చివరితేదీ ఈ రోజు (ఆగస్టు 21)తో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సూపర్‌వైజర్ సహా వివిధ జూనియర్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులను అనుసరించి రూ.18,000 నుంచి రూ.1 లక్ష వరకు జీతభత్యాలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IBPS Jobs Last Date : దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 4,451 స్పెషలిస్ట్ ఆఫీసర్, ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి కూడా దరఖాస్తు చివరితేదీ నేడే (ఆగస్టు 21). అర్హులైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వైబ్‌సైట్‌కు వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
IBPS PO Jobs Apply Last Date : ఐబీపీఎస్ పీఓ, ఎస్ఓ నోటిఫికేషన్ .. దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్!
HPCL Engineering Jobs : ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. హెచ్పీసీఎల్లో 276 ఉద్యోగాలు!