ETV Bharat / bharat

అసెంబ్లీ ముందు రైతు ఆత్మహత్యాయత్నం, ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు - అసెంబ్లీ ఎదుట రైతు సూసైడ్

అసెంబ్లీ ముందు ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. కిరోసిన్ పోసుకొని ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. దీనిపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ విచారం వ్యక్తం చేశారు.

farmer-sets-himself-ablaze-outside-vidhan-bhavan

author img

By

Published : Aug 23, 2022, 5:04 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని సుభాష్ భానుదాస్ దేశ్​ముఖ్​(55)గా గుర్తించారు. అతడిది ఒస్మానాబాద్​లోని తాండల్వాడి గ్రామం. సోదరుడితో భూతగాదాల నేపథ్యంలోనే అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు.

ఇదీ జరిగింది..
రైతు అయిన దేశ్​ముఖ్​కు తన సోదరుడితో భూతగాదాలు తలెత్తాయి. ఇరువురూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. మధ్యాహ్నం 12.30 గంటలకు ముంబయిలోని విధానసభ గేటు ముందుకు వచ్చిన సుభాష్ ఆత్మహత్యకు యత్నించాడు. వెంట తెచ్చుకున్న కిరోసిన్​ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. అయితే, అక్కడే ఉన్న కొంతమంది పోలీసులు అతడిని గమనించారు. వెంటనే దేశ్​ముఖ్ వద్దకు వెళ్లి మంటలు ఆర్పేశారు. పెట్రోలింగ్ కారులో బాధితుడిని జీటీ ఆస్పత్రికి తరలించారు.

farmer-sets-himself-ablaze-outside-vidhan-bhavan
రైతు ఆత్మహత్యాయత్నం

'బాధితుడు స్పృహలోనే ఉన్నాడు'..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై శాసనమండలిలో విపక్షాలు వివరణ కోరిన నేపథ్యంలో స్పందించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 'అతడికి 15-20 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రభుత్వం దీన్ని పర్యవేక్షిస్తోంది. పోలీసులు మంటను ఆర్పేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతడు స్పృహలోనే ఉన్నాడు. మెరైన్ డ్రైవ్ పోలీసులు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టారు' అని ఫడణవీస్ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.