జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ను కలిసేందుకు సాహసం చేశాడు ఓ కన్నడ అభిమాని. ఏకంగా 400 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు. అతడే కర్ణాటక బళ్లారిలోని లాలా కమాన్ నివాసి బి. చంద్ర శేఖర. పవన్, రామ్‌చరణ్ కోసం గత సోమవారం ఈ యాత్ర చేపట్టిన అతడు.. ఆదివారం హైదరాబాద్‌లోని షాద్‌నగర్ చేరుకున్నాడు.
![pawan kalyan fan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bly-01-padayatre-vis01mp4_05062022125656_0506f_1654414016_745.jpg)
గత కొన్నేళ్లుగా పవన్ కల్యాణ్‌ను కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు చంద్రశేఖర. అయితే ఎప్పుడూ కలవలేకపోయినట్లు తెలిపాడు. బళ్లారి నుంచి హైదరాబాద్‌కు పాత్రయాత్ర చేపట్టడం ద్వారా పవన్‌ను కలవడం ఎంతో ప్రత్యేకమని అన్నాడు. పవర్‌స్టార్‌ను కలవాలనే అతడి కల ఈసారైనా నెరవేరుతుందేమో చూడాలి!
ఇదీ చూడండి: సుశాంత్ పేరుతో మోసం.. ఏడాది పాటు ఫ్రీగా హోటల్లో.. నకిలీ చెక్‌తో బురిడీ