ETV Bharat / bharat

చిన్నారి కళ్లు, నోట్లో ఫెవిక్విక్ పోసి చెరువులో పడేసిన ఉన్మాది, కుక్కపై అత్యాచారం - honor killing in uttarpradesh

ఆరేళ్ల చిన్నారి కళ్లతో పాటు నోటిలో ఫెవిక్విక్​ గమ్ పోసి అతికించి దారుణంగా ప్రవర్తించింది ఓ మహిళ. అనంతరం ఆ పిల్లవాడిని చెరువులో పడేసింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో జరిగింది. మరోవైపు మహారాష్ట్రలోని పుణెలో కుక్కపై పలుమార్లు అసహజ చర్యకు పాల్పడుతున్న ఓ కామాంధుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

the eyes and mouth of a six year child were glued by a lady in up

author img

By

Published : Aug 28, 2022, 12:06 PM IST

Updated : Aug 28, 2022, 10:29 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారి కళ్లు, నోటిలో ఫెవిక్విక్ గమ్​​ పోసి అతికించింది ఓ మహిళ. అనంతరం బాలుడ్ని గ్రామ శివార్లలో ఉన్న చెరువులో పడేసింది. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని చిట్నాపుర్​ గ్రామానికి చెందిన కన్హయ్య(6).. గురువారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ దుకాణానికి వెళ్లాడు. ఆ తర్వాత చాలా సమయం గడిచినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు ఊరంతా వెతికినా పిల్లవాడి ఆచూకీ లభించలేదు. కొన్ని గంటలు గడిచాక.. గ్రామ శివార్లలో ఉన్న చెరువులో పిల్లవాడు పడి ఉన్నాడని సమాచారం అందింది.

వెంటనే గ్రామస్థులంతా అక్కడికి వెళ్లి చూడగా కన్హయ్య కళ్లు, నోరు గమ్​తో అతుక్కుపోయి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే హైదర్​గఢ్​లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్​కు చిన్నారిని తరలించారు. దీంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం చిన్నారిని లఖ్​నవూ మెడికల్ కాలేజీకి సిఫార్సు చేశారు. ప్రస్తుతం చిన్నారికి చికిత్స కొనసాగుతోంది. అయితే ఈ దుశ్చర్య తన పొరిగింటి మహిళ చేసి ఉంటుందని చిన్నారి తల్లి పోలీసులకు తెలిపింది. గత కొద్దిరోజులుగా తామిద్దరికి గొడవలు జరుగుతున్నాయని, అందుకే ఆమె ఇలా చేసి ఉంటుందని ఆరోపించింది. తన కొడుకు కూడా ఆమె పేరే చెప్పాడని తెలిపింది.

the eyes and mouth of a six year child were glued by a lady in up
బాధితుడు కన్హయ్య

అనుమానాస్పద రీతిలో యువకుడి మృతదేహం లభ్యం..
ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. అంతకుమందు, గ్రామానికి చెందిన ఓ యువతి చనిపోయింది. అయితే వీరిద్దరూ ప్రేమించుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇది పరువు హత్యగా అనుమానిస్తున్నారు పోలీసులు.

పోలీసుల సమాచారం ప్రకారం.. రుధౌలీ పోలీస్​ స్టేషన్​ పరిధికి చెందిన రాంఫర్ కుమారుడు అంకిత్ అదే గ్రామానికి చెందిన ఇర్షాద్ వద్ద​ ట్రాక్టర్​ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అంకిత్ మృతదేహం​ గ్రామంలో ఉన్న చెరకు తోటలో అనుమానాస్పద రీతిలో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అయితే శుక్రవారం రాత్రి ఇర్షాద్​ పిలిచాడని చెప్పి అతడి ఇంటికి అంకిత్​ వెళ్లాడు. అప్పటి నుంచి అంకిత్​కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని తల్లి చెప్పింది. అయితే ఇర్షాద్​ సోదరి అమీనా ఖతూన్​ మృతి చెందిందని పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత పోలీసులు ఇర్షాద్​ కుటుంబ సభ్యులను కూడా విచారించడం ప్రారంభించారు. అమీనా మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంకిత్​, అమీనా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏఎస్పీ దీపేంద్ర చౌదరి తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

కుక్కనూ వదలని కామాంధుడు..
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి.. తన ఇంటి సమీపంలో ఉన్న కుక్కతో తరచూ అసహజ చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేశారు జంతు సంరక్షకులు. కుక్కకు ఆహారం పెట్టడానికి ఇంట్లోకి పిలిచి ఈ దుశ్చర్య చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులకు అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్​ చేశారు.

ఇవీ చదవండి: వరదలో కొట్టుకుపోయిన లారీ, మూడు టన్నుల సిమెంట్ గంగపాలు

సోనాలీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్, సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం

Last Updated : Aug 28, 2022, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.