ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం - కశ్మీర్​ ఎదురుకాల్పులు

Encounter in Kashmir valley: జమ్ముకశ్మీర్​, పుల్వామా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతులు జైషే మొహమ్మద్​ ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

militants killed in encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Jan 5, 2022, 9:52 AM IST

Encounter in Kashmir valley: జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. పుల్వామా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్​కౌంటర్​లో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా దళాలు. ​

జిల్లాలోని చండ్గామ్​ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం మేరకు.. నిర్బంధన తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపైకి కాల్పులు జరిపారు ముష్కర మూకలు. వారిని నిలువరించేందుకు బలగాలు కాల్పులు జరపగా.. ఎన్​కౌంటర్​కు దారితీసింది. ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. బలగాల కాల్పుల్లో హతమైన వారిలో పాకిస్థాన్​కు చెందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరుకి జైషే మొహమ్మద్​ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు చెప్పారు.

సంఘటనా స్థలంలో భారీగా మందుగుండు సామగ్రి, రెండు ఎం-4 కార్బెన్స్​, ఒక ఏకే సీరీస్​ రైఫిల్​ వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తమ ఆపరేషన్​కు ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.