ETV Bharat / bharat

ఈసీ కీలక ఆదేశాలు.. ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయం భారీగా తగ్గింపు - election commission latest news

ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల లావాదేవీలను మరింత పారదర్శకంగా ఉండేందుకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార వ్యయంలో భాగంగా చేసే నగదు చెల్లింపులను ఇకపై రూ.2 వేలకే పరిమితం చేయాలని సూచించింది.

election commission
ఎన్నికల సంఘం
author img

By

Published : Nov 7, 2022, 9:38 AM IST

ఎన్నికల్లో నగదు చలామణి తగ్గించే విషయంలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కొత్త ప్రతిపాదనను తెర మీదికి తెచ్చింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార వ్యయంలో భాగంగా చేసే నగదు చెల్లింపులను ఇకపై రూ.2 వేలకే పరిమితం చేయాలని సూచించింది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.10 వేలుగా ఉంది. రూ.2 వేల కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే.. బ్యాంకు ఖాతా, చెక్కులు లేదా డిజిటల్‌ పేమెంటు చేయాలని ఎన్నికల సంఘం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో సూచించింది. గుజరాత్‌ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన ఈసీ ఎన్నికల ఖర్చులను పర్యవేక్షిస్తూ, తనిఖీ చేసే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఇతర బృందాలకు ఈ మేరకు ప్రామాణిక నిర్వహణ విధానం జారీ చేసింది.

ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం.. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయటానికి కనీసం ఒక రోజు ముందైనా ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలి. నామినేషన్ తేదీ నుంచి ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీ వరకు రోజువారీ ఖర్చులకు సంబంధించిన ఖాతా పుస్తకాన్ని నిర్వహించాలి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజులలోపు అభ్యర్థి ఎన్నికల ఖర్చుల వివరాలకు సంబంధించిన ఖాతాను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలి.

ఇవీ చదవండి:కాంగ్రెస్‌ గడీలపై కమలం కన్ను.. కంచుకోటను కదిలించేనా?

హిమాచలంలో రాచరికం నెగ్గేనా? మార్పు వస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.