ETV Bharat / bharat

8 ఏళ్లుగా రేప్.. మహిళ ఆత్మహత్య- కూతురి జననాంగాల్లో వేడి నూనెపోసి.. - మహిళ యాసిడ్ ఒత్తిడి అసోం

ఎనిమిదేళ్ల నుంచి తనపై అత్యాచారం జరుగుతోందని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడు తనకు 14సార్లు అబార్షన్ చేయించాడని సూసైడ్ నోట్​లో తెలిపింది. మరోవైపు, దత్తత తీసుకున్న కూతురి పట్ల కర్కశంగా వ్యవహరించింది తల్లి. రహస్య భాగాల్లో వేడి నూనె పోసింది.

eight-years-rape-woman
eight-years-rape-woman
author img

By

Published : Jul 14, 2022, 2:18 PM IST

Delhi 8 years rape: దిల్లీలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్లుగా అత్యాచారం తనపై జరుగుతోందన్న బాధతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఓ వ్యక్తి ఆమెపై ఎనిమిదేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఇప్పటికి 14 సార్లు అబార్షన్ చేయించాడు. దీంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి దుస్తుల్లో సూసైడ్ నోట్ లభించిందని డీసీపీ ఇషా పాండే తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జైత్​పుర్​లోని అర్పణ్ విహార్ ప్రాంతంలో బాధితురాలు(33) నివాసం ఉండేది. తొమ్మిదేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వీరు హాస్టల్​లో ఉంటూ చదువుకుంటున్నారు. జులై 5న మహిళ ఇంట్లోనే ఉరేసుకొని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు ఎయిమ్స్​కు తరలించారు. అప్పటివరకు ఆత్మహత్య కేసుగానే పోలీసులు భావించారు. కానీ, మహిళ ధరించిన దుస్తుల్లో సూసైడ్ నోట్ లభించింది. వైద్యులు దాన్ని గుర్తించి పోలీసులకు జులై 7న అప్పగించారు.

బిహార్ మాధేపుర జిల్లాకు చెందిన గౌతమ్ అనే వ్యక్తి తనను లైంగికంగా వాడుకున్నాడని నోట్​లో మృతురాలు ఆరోపించింది. 'నోయిడాలోని ఓ సాఫ్ట్​వేర్ కంపెనీలో గౌతమ్ పనిచేస్తున్నాడు. గత ఎనిమిదేళ్లుగా అతడు నాపై అత్యాచారం చేస్తున్నాడు. ఈ సమయంలో నేను 14సార్లు గర్భవతి అయ్యాను. ప్రతిసారి గౌతమ్ అబార్షన్ చేయించాడు. . అతడు చేసిన తప్పులకు సంబంధించి చాలా ఆధారాలు సేకరించా. నా ఫోన్​ను చెక్ చేయండి' అని నోట్​లో మహిళ రాసుకొచ్చింది. ఈ నోట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్నారు. అతడిని ఇంకా అరెస్టు చేయలేదని చెప్పారు.

యాసిడ్ తాగాలని ఒత్తిడి..
అసోంలో ఓ మహిళ పట్ల తన అత్తింటి కుటుంబ సభ్యులు కర్కశంగా ప్రవర్తించారు. యాసిడ్ తాగాలని ఒత్తిడి చేశారు. రాష్ట్రంలోని కరీంగంజ్​లో ఈ ఘటన జరిగింది. మహిళ భర్త సైతం ఆమెను చిత్రహింసలు పెట్టేవాడని జిల్లా ఎస్పీ పద్భనాభ్ బారువా తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

చిన్నారిపై వేడివేడి నూనె పోసి..
యూపీలోని లఖ్​నవూలో దత్తత తీసుకున్న చిన్నారిని.. తల్లి చిత్రహింసలు పెట్టింది. వేడివేడి నూనెను బాలిక మర్మాంగాల్లో పోసింది. దీంతో చిన్నారి శరీర భాగాలు కాలిపోయాయి. జులై 8న ఈ ఘటన జరిగింది. మహిళపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలిని అరెస్టు చేసినట్లు ఠాకూర్​గంజ్ ఇన్​స్పెక్టర్ వెల్లడించారు.

బాలిక తండ్రి అజయ్ రాఠోడ్.. చిరువ్యాపారి. పిల్లలు లేకపోవడం వల్ల చిన్నారిని ఈ ఏడాది ఫిబ్రవరిలో దత్తత తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో అతడు షాపులో ఉన్నాడు. తొలుత.. పొరపాటును టీ మీద పడిందని భార్య నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, చిన్నారి నిజం చెప్పేసింది. నూనె వేడి చేసి శరీర భాగాలపై పోసిందని తండ్రికి వివరించింది. 'ఐదు నెలల నుంచి బాలికపై తల్లి కర్కశంగా ప్రవర్తిస్తోంది. అనవసరంగా రోజూ కొట్టేది. అన్నం పెట్టమని అడిగినందుకే ఒంటిపై నూనె పోసింది' అని బాధితురాలి మామయ్య శత్రోహన్ రాఠోడ్ తెలిపారు. ఘటన జరగ్గానే నిందితురాలు తన పుట్టింటికి పారిపోయింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

యువతిపై అత్యాచారయత్నం
హరియాణా గురుగ్రామ్​లో ఓ యువతిని హోటల్ రూమ్​లో బంధించి లైంగిక వేధింపులకు గురిచేశారు. ఉద్యోగం పేరుతో యువతిని స్నేహితులే మోసం చేశారు. అత్యాచారం చేసేందుకు నిందితులు యత్నించారని యువతి ఆరోపించింది. అజయ్, పవన్ అనే ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఓ నిందితుడిని అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.

యువతి స్వస్థలం బంగాల్. గురుగ్రామ్​లోని ఓ క్లబ్​లో డ్యాన్సర్​గా పనిచేస్తోంది. అక్కడే ఆమెకు అజయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్దిరోజుల క్రితం మహిళ తన ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అజయ్.. ఓ హోటల్​కు పిలిపించుకున్నాడు. హోటల్​కు యువతి వెళ్లగానే ఆమెను బంధించి లైంగికంగా వేధించాడు. జవహర్ అలియాస్ పవన్ అనే వ్యక్తితో కలిసి.. యువతిపై అత్యాచారానికి యత్నించాడు. వీరిద్దరూ తనను తీవ్రంగా కొట్టారని యువతి ఆరోపించింది. 'అవకాశం దొరకగానే వారి నుంచి తప్పించుకొని పారిపోయా. కానీ, సెక్టార్ 46 వద్ద నన్ను చూసి వారు అడ్డగించారు. తిరిగి హోటల్​కు తీసుకొచ్చారు. అక్కడ పోలీస్ కారు ఉండటం చూసి భయపడి పారిపోయారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు' అని యువతి తెలిపింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.