ప్రభుత్వ వ్యవస్థ నిర్లక్ష్యానికి అద్దం పట్టేలా ఓ ఉదంతం వెలుగు చూసింది. అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ బతికుండగానే ఓ వ్యక్తిని... మృతి చెందినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు అధికారులు. దీంతో తనకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రావట్లేదని గుజరాత్లోని వడోదరాకు చెందిన రాజుభాయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే..
వడోదర రామ్‌దేవ్‌పిర్‌లోని చలి తులసివాడి ప్రాంతానికి చెందిన రాజుభాయ్ చావ్డా అనే వ్యక్తి గత కొంత కాలంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రభుత్వం చేసిన ఓ చిన్న తప్పిదం వల్ల బతికుండగానే అతను మృతి చెందినట్లు రికార్డులో నమోదయ్యింది. దీంతో అతనితో పాటు అతని కుటుంబానికి రావాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలన్నీ రద్దయ్యాయి. ఇదంతా జరిగి ఎంతో కాలం గడిచింది.
ఎన్నో సార్లు అర్జీలు పెట్టుకున్నా సంబంధిత అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారని రాజు కుటుంబం వాపోయింది. అంతే కాకుండా తాము ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ప్రతిసారి లిస్టులో తమ పేర్లు లేవని అక్కడ నుంచి పంపించేవారని చెబుతోంది. ఈ సమస్య వల్ల తన పిల్లలు సైతం ఎంతో నష్టపోతున్నారని.. ప్రభుత్వం ఇప్పటికన్నా న్యాయం చేయాలని రాజుభాయి కోరుతున్నాడు.
ఇదీ చదవండి: