ETV Bharat / bharat

తనువు చాలించి.. ఏడుగురికి ప్రాణదాతగా నిలిచిన స్టేజ్​ ఆర్టిస్ట్​ - కోల్​కతాలో మృతి చెందిన వ్యక్తి అవయవదానం న్యూస్

బ్రెయిన్​ డెడ్​తో మృతి చెందిన ఓ వ్యక్తి అవయవాలను.. ఆయన కుటుంబసభ్యులు దానం చేసి ఏడుగురి ప్రాణాలను కాపాడారు. ఈ అరుదైన సంఘటన బంగాల్​లో జరిగింది.

Dramatist donates body organs to save 7 lives in Kolkata
బ్రెయిన్ డెడ్​తో మృతి చెందిన వ్యక్తి అవయవదానంతో ఏడుగురికి పునర్జన్మ
author img

By

Published : Dec 31, 2022, 4:34 PM IST

బంగాల్​లోని కోల్​కతాలో బ్రెయిన్​ డెడ్​తో మరణించిన వ్యక్తి.. ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. మరణించిన వ్యక్తి అవయవాలను ఆయన కుటుంబసభ్యులు దానం చేశారు. దీంతో వైద్యులు.. ఏడుగురి ప్రాణాలను కాపాడారు.

అసలేం జరిగిందంటే..
పూర్బ బర్ద్వాన్​లోని హత్​గోబింద్​పుర్​లో నివసిస్తున్న హిరణ్​మోయ్ ఘోషల్(54) నాటకీయరంగంలో సుప్రసిద్ధుడు. ఆయన బుధవారం మధ్యాహ్నం డైనింగ్​ హాల్​లో అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు స్కానింగ్​ చేసి ఆయన మెదడులో బ్లడ్ క్లాట్ అయినట్లు గుర్తించారు. అనంతరం అతడి పరిస్థితి విషమించడం వల్ల మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఘోషల్‌కు శస్త్ర చికిత్స చేసే పరిస్థితి లేనందున లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ పెట్టారు. అది జరిగిన మరుసటి రోజే ఆయన బ్రెయిన్ డెడ్​తో మృతి చెందారు.

బ్రెయిన్ డెడ్​తో మృతి చెందటం వల్ల ఘోషాల్ మిగిలిన శరీర భాగాలు బాగానే ఉన్నాయి. దీంతో ఘోషల్ అవయవాలను దానం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. వెంటనే ఘోషల్​ కార్నియా, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండెను కుటుంబసభ్యులు దానం చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

ఆ తర్వాత గ్రీన్​ కారిడార్​ ద్వారా ఘోషల్​ ఊపిరితిత్తులను విమానాశ్రయానికి వైద్యులు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు తీసుకెళ్లారు. దీంతో పాటు గ్రీన్ కారిడార్ ద్వారానే నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి ఓ కిడ్నీని తరలించారు. కాలేయం, మరొక కిడ్నీని ఎస్​ఎస్​కేఎం ఆసుపత్రికి పంపించారు. కార్నియాను నగరంలోని శంకర్ కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ విధంగా ఘోషాల్ అవయవదానంతో ఏడుగురి ప్రాణాలను వైద్యులు కాపాడారు.

తూర్పు భారత్​లో ఓ వ్యక్తి చేసిన అవయవదానం ద్వారా ఇంత మంది కోలుకోవడం ఇదే మొదటిసారి అని వైద్యులు భావిస్తున్నారు. "ప్రజలు అవయవదానంపై అవగాహనను పెంచుకోవాలి. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. ఘోషాల్ కుటుంబం లాగానే ఇతర కారణాలతో మృతి చెందిన పేషెంట్ల కుటుంబాలు అవయవదానం చేయాలి" అని ఆసుపత్రి డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ అమిత్ రాయ్ తెలిపారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.