ఉత్తర్ప్రదేశ్ అమరోహా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి బయట పడుకున్న దళిత వర్గానికి చెందిన తల్లికూతుళ్లను హత్యచేశారు. బయట పడుకున్న తల్లీకూతుళ్ల తలలను నరికి చంపారు.
పోలీసుల కథనం ప్రకారం.. గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాక్టెర్ గ్రామంలో మిథ్లేశ్ (38), ఆమె కుమార్తె యాశీ(10) నివసిస్తున్నారు. రోజూలాగే శనివారం ఇంటి ఆవరణలో పడుకున్న తల్లీకూతుళ్లు తెల్లారేసరికి శవాలై కనిపించారు. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో ఇద్దరు తలలను నరికి చంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మొరుగుతోందని కుక్కను కాల్చి చంపిన వ్యక్తి : కుక్క తరచూ మొరుగుతోందని ఆగ్రహించిన ఓ వ్యక్తి.. దానిని తుపాకీతో కాల్చిచంపాడు. ఈ కర్ణాటక బెంగళూరు గ్రామీణంలోని దూడ్డబళ్లాపుర్ తాలుకాలో శనివారం జరిగింది. హరీశ్ అనే వ్యక్తి 5 ఏళ్ల వయసున్న ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన కృష్ణప్ప పందులను పెంచుతున్నాడు. తనను చూసిన కుక్క మొరుగుతోందని ఆగ్రహించిన కృష్ణప్ప.. అతడి వద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్చి చంపాడు.
కుక్క తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. వెంటపడి దానిని అంతమొందించాడు. కృష్ణప్పకు లైసెన్స్ లేని నాలుగు తుపాకులు ఉన్నాయని.. అతడిపైన చర్యలు తీసుకోవాని హరీశ్ కోరుతున్నాడు. తనకు సహాయం చేయాలంటూ జంతు సంరక్షణ ప్రతినిధులను ఆశ్రయించాడు. దీనిపై దూడ్డబళ్లాపుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం శునకం మృతదేహాన్ని జంతు వైద్యశాలకు తరలించి శవపరీక్ష నిర్వహించారు.
ఇవీ చదవండి: టైప్రైటర్స్కు మ్యూజియం.. ప్రత్యేక ఆకర్షణగా 110ఏళ్ల నాటి 'కరోనా'
అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్.. విద్యార్థుల ఆందోళనలతో యూనివర్సిటీలో దుమారం