DMK President Election : డీఎంకే పార్టీ అధ్యక్షునిగా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. చెన్నైలో ఆదివారం జరిగిన డీఎంకే సర్వసభ్య సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నేత దురై మురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొన్నాయి. స్టాలిన్‌తో పాటు ఇద్దరు నేతలు.. తమ తమ పదవులకు వరుసగా రెండోసారి ఎన్నికైనట్లు పార్టీ నేతలు తెలిపారు.
2018లో కరుణానిధి మరణం తర్వాత.. డీఎంకే రెండో అధ్యక్షునిగా స్టాలిన్ తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1969లో కరుణానిధి డీఎంకే తొలి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ ఏడాది మొదటిసారి అధ్యక్ష పదవిని ఏర్పాటు చేశారు. అంతకుముందు వరకు డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగారు. 1949లో డీఎంకే పార్టీని స్థాపించారు.
ఇవీ చదవండి: లైవ్ వీడియో.. వరదలో బస్సు బోల్తా.. లక్కీగా 50 మంది..
ఉద్ధవ్, శిందేలకు షాక్.. పార్టీ గుర్తును స్తంభింపజేసిన ఎన్నికల సంఘం