ETV Bharat / bharat

దీపావళిని ఐదు రోజుల పండగంటారు?-ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి! - దీపావళి 2023 ఎప్పుడు వచ్చిందంటే

Diwali 2023 Five Days Festival : దేశవ్యాప్తంగా ప్రస్తుతం దీపావళి సందడి మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో దివాళీని రెండు రోజులు జరుపుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఈ పండగను ఐదు రోజులపాటు జరుపుకుంటారు. దీవపాళి.. ధంతేరాస్​​తో మొదలుపెట్టి అన్నా చెల్లెల పండగతో ముగిస్తారు. అయితే ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, ఏ రోజుకు ఎటువంటి ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Diwali_2023_Five_Days_Festival
Diwali_2023_Five_Days_Festival
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 5:35 PM IST

Diwali 2023 Celebrated Five Days in India : చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఎంతో ఆనందంగా చేసుకొనే వెలుగుల పండుగ దీపావళి. అమావాస్య చీకట్లను పారదోలి తమ జీవితంలో వెలుగులు నింపే సంతోషాల సంబరమిది. అయితే చాలా మంది ఈ తరంలో దీపావళి(Diwali 2023) అంటే ఒక్కరోజు పండుగే అనుకుంటారు. ఆ రోజు లక్ష్మీ పూజను చేసి టపాసులు కాల్చడంతో పండగ పూర్తయిందని అనుకుంటారు. నిజానికి ఈ దీపాల పండగ ఐదు రోజుల పాటు జరుపుకునే ఆనందాల వేడుకని మీకు తెలుసా?

5 Days of Diwali 2023 : దీపావళి ఐదు రోజుల పండుగలో ఒక్కోరోజు ఒక్కో ప్రాముఖ్యత, గుర్తింపు కలిగి ఉంది. ఈ వేడుకల్లో భాగంగా లక్ష్మీ దేవి, రాముడు, కృష్ణుడు, నాగేంద్రుడుని ఆరాధిస్తారు. ఈ ఐదు రోజుల పండగ ధంతేరాస్​(Dhanteras 2023) షాపింగ్​తో మొదలై.. నరక చతుర్దశి, దీపావలి అమావాస్య, బలి పాడ్యమి, భాయిదూజ్​తో ముగుస్తుంది. అయితే విశిష్టతల కలబోతైన ఐదు రోజుల దివాళీ గురించి పురాణాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడు జరుపుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ధన త్రయోదశి.. హిందూ ధర్మంలో దక్షిణాయనానికి అందులోను ఆశ్వయుజ, కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దక్షిణాయనంలో ఆశ్వయుజ మాసం బహుళ పక్ష త్రయోదశి నుంచి కార్తీకమాసం శుక్ల పక్ష ద్వితీయ వరకు ఈ 5 రోజులూ దీపాల పండుగ ప్రత్యేకంగా జరుపుకొంటారు. ఇందులో తొలి రోజు ధన త్రయోదశి/ధంతేరాస్​​గా జరుపుకుంటాం.

అశ్వయుజ మాసంలోని త్రయోదశి తిథి నాడు సముద్ర మథన సమయంలో ధన్వంతరి ఉద్భవించాడు. అప్పటి నుంచి ఈ ధంతేరాస్​ మొదలైంది. ఈ రోజు కొత్త వస్తువులు(ముఖ్యంగా బంగారం) కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం ఒక సంప్రదాయం. అలాగే దీపాలను దానం చేయాలనే నమ్మకం కూడా ఉంది. ఫలితంగా యమరాజు సంతోషించి.. ఆశీర్వాదాన్ని ఇస్తాడని నమ్ముతారు. ఈ ఏడాది ధంతేరాస్​​ను నవంబర్ 10, 2023న జరుపుకోనున్నారు.

నరక చతుర్దశి.. ద్వాపర యుగంలో ఈ ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథిలో శ్రీ కృష్ణుడు, సత్యభామ తో కలిసి లోక కంటకుడైన నరకాసురుడిని సంహరించాడు. అప్పటి నుంచి ఈరోజున నరక చతుర్దశి పండుగను జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలంతా ఇళ్లనూ, వాకిళ్లనూ అలంకరించి పూజలు చేస్తారు. అలాగే ఈ నరక చతుర్దశి రోజున ఐదు లేదా ఏడు దీపాలు వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఈసారి 11 నవంబర్ 2023 న ఈ పండగను జరుపుకోనున్నారు.

దీపావళి ఎప్పుడు - 12నా? 13వ తేదీనా? పంచాంగం ఏం చెబుతోంది?

దీపావళి అమావాస్య.. సత్యయుగంలో ఆశ్వయుజ మాసంలోని అమావాస్యనాడు సముద్ర మథనం నుంచి తొలిసారిగా లక్ష్మీదేవి ఉద్భవించింది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మి దేవి వివాహం కూడా జరిగినట్లు పురాణ కథనం. దాంతో అప్పటి నుంచి దీపావళి సంబరాలు మొదలయ్యాయి. తర్వాత త్రేతాయుగంలో ఈ రోజున, రాముడు వనవాసం నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ రోజున దరిద్ర దేవతను వెళ్లగొట్టేందుకు మహాలక్ష్మిని పూజిస్తారు. ఈ ఏడాది నవంబర్ 12, 2023 నాడు దీపావళి పండుగను జరుపుకోనున్నారు.

బలి పాడ్యమి/గోవర్ధన పూజ.. దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్‌’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజు కూడా ఇదే. దాంతో ఈ రోజు అప్పటి నుంచి ఐదు రోజులు జరుపుకునే పండుగలో గోవర్ధన పూజ ఒక భాగంగా మారింది. ఈ పండుగను ఈ ఏడాది నవంబర్ 13, 2023 రోజు జరుపుకోనున్నారు. ఆ తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా జరుపుకుంటారు. ఈరోజు మహిళలు ఉపవాసం ఉండి నాగపూజను ఆచరిస్తారు.

భగిని హస్త భోజనం.. ఇక చివరగా అన్నాచెల్లెళ్ల పండగను జరుపుకుంటారు. దీనినే భగిని హస్త భోజనం, యమ ద్వితీయ, భాయిదూజ్​గా కూడా పిలుస్తారు. ద్వాపర యుగంలో కృష్ణుడు ఈ రోజు నాడు నరకాసురుడిని ఓడించిన తర్వాత తన సోదరి సుభద్రను కలవడానికి వెళ్లాడు. అలాగే సత్యయుగంలో యమ ధర్మరాజు ఈ రోజున తన సోదరి యమున ఆహ్వానంపై ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడు యమునా దేవి తన అన్నకు కుంకుమ దిద్ది ఇష్టమైన ఆహారం కొసరి కొసరి వడ్డించింది. అప్పటి నుంచి ఈ రోజును అన్నా చెల్లెల పండగగా జరుపుకుంటారు. ఈ పర్వదినం సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఆదర్శంగా నిలుస్తోంది. అన్నాచెల్లెళ్ల పండగ ఈ ఏడాది నవంబర్ 14 న జరుపుకోనున్నారు.

దీపావళి వేళ - మీ ఇంటి డెకరేషన్ కోసం సూపర్​ ఐడియాస్​!

Festivals in November 2023 : అట్లతద్ది నుంచి.. దీపావళి దాకా.. నవంబరులో ఎన్ని పండగలు, వ్రతాలు ఉన్నాయో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.