ETV Bharat / bharat

వ్యాపారంలో చిన్నోళ్లు- భాషా జ్ఞానంలో ఘనులు!

author img

By

Published : Aug 2, 2021, 4:46 PM IST

చారిత్రక, పురాతన మార్కెట్లకు దేశ రాజధాని ప్రసిద్ధి. అక్కడ షాపింగ్​ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దిల్లీలోని ఇండియన్​ నేషనల్​ ఎయిర్​వేస్​(ఐఎన్ఏ) మార్కెట్​కు భారతీయులతో పాటు.. విదేశీయులు సైతం క్యూ కడతారు. ఈ మార్కెట్​ని నడిపేది హిందీవారే అయినా.. అనర్గళంగా విదేశీ భాషలు మాట్లాడేస్తారు. దేశ, విదేశీ కస్టమర్లకు కావాల్సిన వస్తువులను క్షణాల్లో అందిస్తారు.

వ్యాపారులకు విదేశీ భాషలూ తెలుసు
వ్యాపారులకు విదేశీ భాషలూ తెలుసు
ఆ మార్కెట్​ వ్యాపారులకు విదేశీ భాషలూ తెలుసు..!

దుకాణాలు చిన్నవైనా, పెద్దవైనా.. వచ్చిన కస్టమర్​కు కావాల్సిన వస్తువును అందించేలా ఉండాలి. వారు చెప్పే మాటలు అర్థమైనప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ సూత్రాన్ని సరిగ్గా వంటపట్టించుకున్నారు దిల్లీలోని ఇండియన్​ నేషనల్​ ఎయిర్​వేస్​ మార్కెట్​లోని దుకాణదారులు. అక్కడకు వచ్చే విదేశీయుల కోసం వారి భాషల్లోనే సేవలందిస్తూ ఔరా అనిపిస్తున్నారు.

ఐఎన్​ఏ మార్కెట్.. తాజా పండ్లు, కూరగాయలతో పాటు.. వస్త్రాలు, సీఫుడ్స్​, మాంసాహారం ఒకటేమిటి అనేక రకాల వస్తువులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ షాపింగ్​ చేసేందుకు జపాన్​, చైనా, నైజీరియా, ఫ్రాన్స్​, జర్మనీ సహా పలు దేశాలకు చెందిన రాయబార కార్యాలయ ఉద్యోగులు, దౌత్యవేత్తలు, నగరంలోని పేరుమోసిన పెద్ద రెస్టారెంట్లలో దిగే విదేశీయులు వస్తుంటారు. ఈ క్రమంలో అక్కడ వ్యాపారం చేసేది హిందీ వారే అయినా.. ఏ కస్టమర్​ వస్తే వారికి అర్థమయ్యేలా.. వారి భాషలోనే అనర్గళంగా మాట్లాడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తారు.

shopkeepers-of ina-market-of delhi knows many foreign languages
ఐఎన్​ఏ మార్కెట్​లోని ఓ దుకాణం

అశోక్ లూత్రా అనే వ్యాపారి గత 25 సంవత్సరాలుగా ఈ మార్కెట్‌లో ఓ దుకాణం నిర్వహిస్తున్నారు. తమ వద్దకు దేశీయ వినియోగదారులతో పాటు.. జపాన్, చైనా, నైజీరియా, ఫ్రాన్స్, జర్మనీ నుంచి కూడా కస్టమర్లు వస్తారని చెబుతున్నారు.

"మా వద్ద దేశీయ, అంతర్జాతీయ వస్తువులు అన్నీ​ లభిస్తాయి. విదేశీయులు వచ్చినప్పుడు వారి భాషలోనే మాట్లాడతాం. నేను దాదాపు 12 నుంచి 15 భాషల్లో మాట్లాడతాను. కస్టమర్​ చెప్పేది తొలుత అర్థం అయ్యేది కాదు. క్రమంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ పలు భాషలు నేర్చుకున్నా. ఇందుకోసం ఎలాంటి కోర్సులు తీసుకోలేదు. చాలా దేశాల నుంచి కస్టమర్లు వస్తారు. ఎక్కువగా ఆసియా దేశాల వారు ఉంటారు. చైనా, కొరియా, జపాన్​, మలేషియా, అరబిక్​ దేశాల వారితో పాటు ఐరోపా దేశాల వారూ ఉంటారు. "

- అశోక్​ లూత్రా, వ్యాపారి, ఐఎన్​ఏ మార్కెట్​

తమ దుకాణంలోకి వచ్చే కస్టమర్లతో సంభాషించడం మొదట్లో కష్టంగా ఉండేదని దీపక్ భూతానీ అనే వ్యాపారి తెలిపారు. అయితే.. క్రమంగా ఆయా భాషలపై పట్టు సంపాదించినట్లు చెప్పారు.

"మాకు ఎక్కువగా దక్షిణ భారత కస్టమర్లు వస్తుంటారు. నాకు మలయాళం భాష వచ్చు. నాకు నైజీరియన్​, ఫ్రెంచ్​ వంటి భాషలు కొంచెం కొంచెం తెలుసు. ఆఫ్రికా దేశాల కస్టమర్లు వస్తుంటారు. వారి భాషలోనే మాట్లాడతాం. "

- దీపక్​ భుటానీ, వ్యాపారి.

ఇండియన్ నేషనల్ ఎయిర్‌వేస్(ఐఎన్​ఏ) మార్కెట్​గా పేరొందిన దీనిని గతంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ మార్కెట్ అని పిలిచేవారు. ఈ మార్కెట్​ను 1964లో ప్రారంభించారు. ఆ సమయంలో ఇక్కడ ఆర్మీ క్యాంప్ ఉండేది. అందుకే ఈ మార్కెట్‌ను ఇండియన్ నేషనల్ ఆర్మీ అని పిలుస్తారు. ఆ తరువాత ఈ స్థలాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించారు. దీనితో మార్కెట్ పేరు సైతం మారిపోయింది. కానీ ఇప్పటికీ చాలా మంది దీనిని ఇండియన్ నేషనల్ ఆర్మీ పేరుతోనే పిలుస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.