ETV Bharat / bharat

గంటన్నరలోనే 50 పేజీల బుక్​ రాసి బాలిక రికార్డ్!

గంటన్నర సమయంలో.. 50 పేజీల పుస్తకాన్ని చదవమంటేనే.. కొంతమంది తమ వల్ల కాదని చేతులెత్తేస్తారు. అలాంటిది ఓ 13 ఏళ్ల బాలిక మాత్రం అంతే సమయంలో.. ఏకంగా పుస్తకమే రాసేసింది. దాంతో 'ఇంక్​జోయిడ్​ బుక్​ ఆఫ్​ రికార్డ్ 2021'లో ఆమె స్థానం సంపాదించింది.

delhi girl writer
'ది డెడ్​ ఎండ్'​ పుస్తక రచయిత్రి యమ్నా
author img

By

Published : Jul 28, 2021, 3:06 PM IST

లాక్​డౌన్ సమయంలో చాలా మంది కొత్త కళలు నేర్చుకున్నారు. మరికొంతమంది తమలో దాగున్న ప్రతిభకు పదును పెట్టారు. దిల్లీకి చెందిన ఓ బాలిక కూడా అదే తరహాలో సాధన చేసి.. ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది.

'ది డెడ్​ ఎండ్​' పేరుతో.. 50 పేజీల పుస్తకాన్ని కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే రాసింది యమ్నా. మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించిన అంశాలను ఈ పుస్తకంలో ఆమె పొందుపర్చింది. దీంతో 'ఇంక్​జోయిడ్​ బుక్ ఆఫ్​ రికార్డ్​ 2021'లో ఆమె స్థానం సంపాదించింది. అంతేకాదు.. లాక్​డౌన్​ టైంలో ఒకటిన్నర నెలల వ్యవధిలోనే 53 పుస్తకాల స్క్రిప్టును సిద్ధం చేసింది యమ్నా. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదివే యమ్నా.. 'ఫాస్టెస్ట్​ సోలో బుక్​ రైటర్​ 2021'గా ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.

delhi girl writer
'ది డెడ్​ ఎండ్'​ పుస్తక రచయిత్రి యమ్నా
delhi girl writer
కుటుంబ సభ్యులతో యమ్నా

చదువులోనూ టాప్..

యమ్నా చిన్నప్పటి నుంచి చదవుల్లో ముందంజలోనే ఉండేది. ప్రస్తుతం ఆమె రబియా పాఠశాలలో చదువుతోంది. యమ్నా తండ్రి మహమ్మద్​ గుల్వేజ్​ ఓ ఎలక్ట్రానిక్​ వస్తువుల తయారీ సంస్థలో పని చేస్తుండగా.. ఆమె తల్లి ఓ గృహిణి. యమ్నా సాధించిన విజయాలకు తన కుటుంబ సభ్యులు, గురువులు, బంధువులు ఎంతో మురిసిపోతున్నారు.

ఎప్పటికైనా తాను ఓ పబ్లిషింగ్​ హౌస్​ను నెలకొల్పుతానని చెబుతోంది యమ్నా. భవిష్యత్తులో తాను ప్రొఫెసర్​ను కావాలనుకుంటున్నట్లు తెలిపింది. పేద ప్రజలకు సాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి: నదిలో తేలియాడిన వేల గుడ్లు.. ఎగబడ్డ జనం

ఇదీ చూడండి: గ్రామాల్లోకి మొసళ్లు- ఇంటి పైకప్పుపై ఎక్కి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.