Dadi Veerabhadra Rao Resigns To YSRCP: వైఎస్సార్సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల స్థానాల్లో మార్పులను చేపట్టింది. అంతేకాకుండా శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోటీ చేసే అభ్యర్థులను కూడా మారుస్తూ వస్తోంది. ఈ క్రమంలో పార్టీ చర్యల ప్రభావంతో కొందరు నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మాజి మంత్రి వైఎస్సార్సీపీ పార్టీని వీడారు. ఈ మేరకు ఆయన అధిష్టానానికి లేఖ పంపించారు.
అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైెఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను, పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. అంతేకాకుండా తన రాజీనామా లేఖను వైఎస్సార్సీపీ పార్టీ ఆగ్ర నేతలకు పంపించినట్లు సమాచారం.
వైసీపీలోని గ్రూపు తగాదాల వల్లే మంత్రి రజని కార్యాలయంపై దాడి: టీడీపీ నేతలు
మాజీ మంత్రి దాడి మాత్రమే కాకుండా ఆయన కుమారులు రత్నాకర్, జయవీర్ కూడా పార్టీని వీడుతున్నట్లు లేఖలో పార్టీ అధిష్ఠానానికి వివరించారు. అయితే వైఎస్సార్సీపీని వీడిన ఈ నేతలు, ఏ పార్టీలో చేరతారనే అంశం అనకాపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దాడి వీరభద్ర రాజీనామాకు ముందు తన అనుచరులు, కార్యకర్తలు శ్రేణులతో సమావేశమైనట్లు సమాచారం. వారితో చర్చలు జరిపిన తర్వాతనే వైఎస్సార్సీపీని వీడినట్లు తెలుస్తోంది. అయితే ఆయన త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం ఉందని ప్రచారం సాగిన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం ఉందని సమాచారం.
దాడి వీర భధ్రరావు బుధవారం చంద్రబాబును కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీలోకి చేరే అంశంపై దాడి చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చంద్రబాబును కలిసే సమయంలో వీరభద్రరావుతో పాటు ఆయన కుమారుడు కూడా రానున్నారని చర్చ సాగుతోంది.
నాలుగు దశాబ్దాల రాజకీయా అనుభవం ఉన్న దాడి వీరభద్రరావు, మొదటగా 1985లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి శాసనసభకు ఎన్నికయారు. అప్పటి నుంచి ఆయనకు నియోజకవర్గంలో ఓటమనేది లేకుండా పోయింది.. 1985 నుంచి 1999 వరకు నాలుగు సార్లు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయంలో పలు శాఖాలకు మంత్రిగా సైతం పనిచేశారు.
వైసీపీలో ముదురుతున్న వర్గపోరు- మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసే అవకాశం ఇవ్వకపోవడంపై ఓ వర్గం ఆగ్రహం
దాడి వీరభద్రరావు కొన్ని సంవత్సరాలు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. 2014కు ముందు వరకు టీడీపీలోనే ఉన్న దాడి వీరభద్రరావు, ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు పక్రియతో, అధిష్టానం తీసుకున్న నిర్ణయాలతో ఆయన వైఎస్సార్సీపీ పార్టీని వీడారు.
వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు - సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు