ఉత్తరాఖండ్ ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లాలో ఓ మొసలి 13 ఏళ్ల బాలుడిని నదిలోకి లాగేసింది. ఖటిమా పరిధిలోని సున్పహర్ గ్రామానికి చెందిన వీర్‌సింగ్ అనే 13ఏళ్ల బాలుడు గేదెతో సహా దేవ్హ నది దాటుతున్నాడు. ఈ క్రమంలోనే మొసలి బాలుడిని నీళ్లలోకి లాగింది. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహూటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభించలేదు.
![crocodile killed child in Khatima](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15732893_crocodile1.jpg)
![crocodile killed child in Khatima](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15732893_crocodile2.jpg)
మొసలిని పట్టుకున్న గ్రామస్థులు అటవీ అధికారులకు అందించారు. మొసలి బాలుడిని మింగిందేమో అనే అనుమానంతో.. ఖటిమా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఎక్స్‌రే తీయించారు. మొసలి కడుపు ఖాళీగా ఉందని అటవీ అధికారులు వెల్లడించారు. నదిలో చాలా మొసళ్లు ఉన్నాయని.. మరొక మొసలి మింగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
ఇదీ చదవండి: 'దిశ' తరహాలో మరో కిరాతకం! యువతిని చంపి, నిప్పంటించి..