Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం 8 గంటల వరకు 8,813మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 29 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో మరో 15,040 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.25 శాతానికి తగ్గాయి.
- మొత్తం కేసులు: 4,42,77,194
- క్రియాశీల కేసులు: 1,11,252
- మొత్తం మరణాలు: 527098
- కోలుకున్నవారు: 4,36,38,844
Vaccination India: భారత్‌లో సోమవారం 6,10,863మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,08,31,24,694 కు చేరింది. మరో 2,12,129మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Covid Cases: ప్రపంచ దేశాల్లోనూ కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 5,01,547మంది వైరస్ బారినపడగా.. మరో 1,224 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,59,01,236కు చేరింది. ఇప్పటివరకు వైరస్‌తో 64,56,460మంది మరణించారు. ఒక్కరోజే 9,13,314మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 569,685,027కు చేరింది.
- జపాన్‌లో కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. కొత్తగా 169,972 కేసులు నమోదయ్యాయి. 155మంది మరణించారు.
- జర్మనీలో 63,742 మంది కరోనా బారిన పడగా.. 140 మంది మృతిచెందారు.
- దక్షిణ కొరియాలో 62,078కేసులు వెలుగులోకి వచ్చాయి. 50 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో తాజాగా 37,565మంది కరోనా బాడినపడ్డట్లు తేలింది. 112 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి: మరో ఆరు నెలల్లో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకా
కలెక్టర్ హత్య కేసులో ఆ నేతకు జీవితఖైదు, అయినా ఇంట్లోనే కాలక్షేపం