ETV Bharat / bharat

భారత్​లో కొత్తగా 10 వేల కరోనా కేసులు, 13 వేల రికవరీలు - India Coronavirus Cases

Covid cases in India భారత్​లో కరోనా కేసులు గురువారం స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 10,725 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.60 శాతానికి పెరిగింది.

covid cases in india  reports 10,725 fresh cases and 13,084 recoveries

author img

By

Published : Aug 25, 2022, 9:40 AM IST

Updated : Aug 25, 2022, 10:06 AM IST

Covid cases in India: దేశంలో కరోనా కేసులు పెరిగాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 10,725 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 36 మంది కరోనాతో మరణించారు. ఒక్కరోజులో 13,084 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.60 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.21 శాతంగా ఉన్నాయి.

  • మొత్తం కేసులు: 4,43,78,920
  • క్రియాశీల కేసులు: 94,047
  • మొత్తం మరణాలు: 5,27,488
  • కోలుకున్నవారు: 4,37,57,385

Vaccination India: భారత్​లో బుధవారం 23,50,665 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,10,82,34,347కు చేరింది. మంగళవారం మరో 3,92,837 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 739,171 కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా భారీగా పెరిగాయి. ఒక్కరోజులో 2 వేలమందికిపైగా మరణించారు. మొత్తం కేసులు 60,31,85,878 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 64,79,892 మంది మరణించారు. ఒక్కరోజే 9,38,644 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,79,06,497కు చేరింది.

  • జపాన్​లో కరోనా కేసులు రోజుకు 2 లక్షల చొప్పున నమోదవుతున్నాయి. బుధవారం మరో 1,94,223 మంది వైరస్​ బారినపడ్డారు.
  • దక్షిణ కొరియాలో కొత్తగా లక్షా 39 వేల కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి.
  • అమెరికాలో మళ్లీ కొవిడ్​ బాధితులు భారీగా పెరిగారు. ఒక్కరోజే 81 వేల కేసులు, 350కిపైగా మరణాలు నమోదయ్యాయి.
  • జర్మనీ, జపాన్​, తైవాన్​లోనూ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి.

ఇవీ చదవండి: బలపరీక్షలో నెగ్గిన నీతీశ్, విపక్షాల ఐక్యతకు పిలుపు, మోదీపై సెటైర్లు

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఉచితాలపై ఏకాభిప్రాయం కావాలన్న సుప్రీంకోర్టు

Last Updated : Aug 25, 2022, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.