ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. రెండో బూస్టర్ డోస్ తీసుకోవడంపై కేంద్రం క్లారిటీ! - దేశంలో కరోనా కేసుల వివరాలు

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 134 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 88 మంది కోలుకున్నారు. మరోవైపు, కరోనా రెండో బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక వ్యాఖ్యలు చేశాయి.

corona Cases in India
భారత్​ కోవిడ్​ కేసులు
author img

By

Published : Jan 3, 2023, 12:11 PM IST

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళ వారం ఉదయం వరకు 134 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,46,78,956
  • మరణాలు: 5,30,707
  • యాక్టివ్ కేసులు: 2,582
  • రికవరీలు: 4,41,45,667

Vaccination In India :
దేశంలో శుక్రవారం 46,450 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,20,11,23,642కు చేరింది. ఒక్కరోజే 1,51,186 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

రెండో డోస్​పై ప్రభుత్వం సూచన..
మరోవైపు, రెండో బూస్టర్​ డోస్​ తీసుకోవడంపై కేంద్ర ప్రభుత్వం ఓ సూచన చేసింది. ప్రస్తుతానికి అందరికి రెండో బూస్టర్​ డోస్ అవసరం లేదని, ముందుగా మొదటి బూస్టర్​ డోస్​ పూర్తైన తరువాత దాని గురించి ఆలోచిద్దామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,16,690 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,222 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 665,589,906కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,699,339 మంది మరణించారు. మరో 543,963 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 637,694,360కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 76,264 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 208 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా 40,785 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 249 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియా 22,735 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 53 మంది మృతి చెందారు.
  • హాంగ్​కాంగ్​లో 20,230 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 74 మంది మృతి చెందారు.
  • బ్రెజిల్​లో 14,508 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 83 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో కొత్తగా 4,975 కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 37 మంది ప్రాణాలు విడిచారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.